విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
వైయస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత మత్స్యకారులకు అండగా అనేక సంక్షేమ పథకాలు అమలు చేయడంతో పాటు వారు శ్రమించి వేటాడిన మత్స్య సంపద మార్కెటింగ్ కు అనేక అవకాశాలను ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కల్పిస్తున్నారని ఆ పార్టీ తూర్పు నియోజకవర్గ ఇన్ ఛార్జ్ దేవినేని అవినాష్ తెలిపారు. గురువారం 9వ డివిజన్ నందు 20 లక్షల రూపాయల ప్రభుత్వ నిధులతో మత్స్యకారుల వ్యాపారానికి అనువుగా చేపట్టిన షేడ్ నిర్మాణానికి అవినాష్ శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా అవినాష్ మాట్లాడుతూ చుట్టూ ప్రక్కల ప్రాంతాల నుండి మత్స్యకారులు వ్యాపారం కోసం ఇక్కడికి వస్తారని వారికి సరైన వసతులు లేవని గత ప్రభుత్వం లో ఎమ్మెల్యే దృష్టికి ఎన్నిసార్లు తీసుకువెళ్లిన ఫలితం మాత్రం లేదని విమర్శించారు. గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా వైసీపీ నాయకులు ఈ ప్రాంతంలో పర్యటించినప్పుడు వీరు మా దృష్టికి సమస్య ను తీసుకురాగా కేవలం నెల రోజుల వ్యవధిలోనే అధికారులు, మున్సిపల్ కమిషనర్ లతో మాట్లాడి 20లక్షల నిధులు మంజూరు చేపించడం జరిగిందని అన్నారు. కేవలం శంకుస్థాపన చేయడమే కాకుండా వీలైనంత త్వరగా ఎలాంటి నాణ్యత లోపం లేకుండా షేడ్ నిర్మాణం పూర్తి చేయడంతో పాటు, చేపలు,రొయ్యలు శుభ్రం చేసుకోవడానికి ప్లాట్ఫారం ఏర్పాటు చేసి అందుబాటులో తెస్తామని అవినాష్ భరోసా ఇచ్చారు.ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ బెల్లం దుర్గ,9వ డివిజన్ ఇంచార్జ్ వల్లూరు ఈశ్వర ప్రసాద్,డివిజన్ అధ్యక్షలు గద్దె కళ్యాణ్,కార్పొరేటర్ చింతల సాంబయ్య,13వ డివిజన్ ఇంచార్జ్ రామాయణపు శ్రీనివాస్, వైసీపీ నాయకులు సుబ్బరాజు,కాళీ మరియు వైస్సార్సీపీ ముఖ్య నాయకులు,కార్యకర్తలు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News