Breaking News

గ్రామాలను పరిశుభ్రంగా ఉంచి ప్రజల ఆరోగ్యాన్ని కాపాడటంలో పారిశుధ్య కార్మికులు ప్రధాన పాత్ర పోషిస్తున్నా

మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త :
గ్రామాలను పరిశుభ్రంగా ఉంచి ప్రజల ఆరోగ్యాన్ని కాపాడటంలో పారిశుధ్య కార్మికులు ప్రధాన పాత్ర పోషిస్తున్నారని జిల్లా కలెక్టర్ పి. రాజాబాబు కొనియాడారు
శుక్రవారం నగరంలోని కలెక్టరేట్ విసీ హాలులో పంచాయతీరాజ్, ఆర్డబ్ల్యూఎస్ శాఖల సంయుక్త ఆధ్వర్యంలో స్వచ్ఛతాహి సేవ కార్యక్రమంలో భాగంగా క్లాప్ (క్లీన్ ఆంధ్ర ప్రదేశ్ )మిత్రలకు (పారిశుద్ధ్య సిబ్బందికి) సన్మానం, ఆహార దినుసుల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు.ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ ముఖ్యఅతిథిగా విచ్చేసి పారిశుధ్య కార్మికులతో ముఖాముఖి మాట్లాడారు. గ్రామాల్లో పారిశుధ్య పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. కొన్నిచోట్ల తొలగించిన చెత్తాచెదారాలను రోడ్డు పైన, రోడ్డుకు ఇరువైపులా పడేస్తున్నారని చెత్తతో అనేక సమస్యలు ఉన్నాయని, ఘన వ్యర్థ పదార్థాల నిర్వహణ కేంద్రాలను సరిగా వినియోగించడం లేదని ఏ విధంగా చేస్తే బాగుంటుందని వారి సలహాలు అడిగి తెలుసుకున్నారు. ఎన్ని గ్రామాల్లో చెత్త వేయడానికి సరైన స్థలాలు ఉన్నాయని, ప్రజలు తడి చెత్త పొడి చెత్త వేరు చేసి ఇస్తున్నారా లేదా, ఎన్ని డంపింగ్ యార్డులు ఉన్నాయి, ఉన్నప్పటికీ రోడ్డు పక్కనే పడేస్తున్నారని, చెత్త నిర్వహణ ఒక సవాలుగా మారింది అనే విషయం గుర్తు చేశారుచెత్త నిర్వహణ పైన ప్రతి ఒక్కరికి సరైన అవగాహన ఉండాలన్నారు.ప్రతి కుటుంబంలో చెత్త నిర్వహణపై బాధ్యత తీసుకోవాలన్నారు.చెత్త నిర్వహణపై సారదులుగా ఉండి ప్రజల్లో అవగాహన పెంపొందించాలన్నారు.గ్రామాల్లో చెత్త నిర్వహణపై ఒక వ్యూహం సిద్ధం చేసి అందులో పారిశుద్ధ్య కార్మికులను భాగస్వాములను చేయాలని అధికారులకు సూచించారు.ఈ సందర్భంగా జిల్లాలోని 25 మండలాల్లో పారిశుధ్య కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటున్న మండలానికి ఇద్దరు చొప్పున 50 మంది క్లాప్ (క్లీన్ ఆంధ్ర ప్రదేశ్) మిత్రలను పిలిపించివారికి అల్పాహారం, కాఫీ తో పాటు 10 కిలోల బియ్యం, రెండు కిలోల కందిపప్పు, ఒక లీటరు వంట నూనెలు జిల్లా కలెక్టర్ ఉచితంగా అందజేసి శాలువలు, పూలమాలలతో ఘనంగా సత్కరించారు.అనంతరం జిల్లా కలెక్టర్ మీడియా ప్రతినిధులతో
మాట్లాడుతూ ఆరోగ్యమే మహాభాగ్యం అని గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలు ఆరోగ్యంగా ఉండాలంటే పరిసరాలు పరిశుభ్రంగా ఉండాలన్నారు. అటువంటి పరిసరాలను ఎప్పటికప్పుడు పరిశుభ్రంగా ఉంచుతూ పారిశుధ్య కార్మికులు ఎంతగానో శ్రమిస్తున్నారన్నారు. జిల్లాలో 1254 మంది క్లాప్ మిత్రలు ఉన్నారని, అందులో 432 మంది ఘన వ్యర్థ పదార్థాల నిర్వహణ కేంద్రాల్లో పని చేస్తున్నారన్నారు. స్వచ్ఛభారత్ కార్యక్రమంలో భాగంగా స్వచ్ఛత హీ సేవా కార్యక్రమాన్ని అక్టోబర్ 2 వ తేదీ వరకు నిర్వహిస్తున్నామన్నారు.పారిశుధ్య కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటున్న కార్మికులను 50 మందిని గుర్తించి వారికి సన్మానం చేయడంతో పాటు ఆహార దినుసులు 10 కేజీల బియ్యం, 2 కేజీల కందిపప్పు, ఒక లీటర్ నూనె ఉచితంగా అందజేయడం జరిగిందన్నారు.క్షేత్రస్థాయిలో పనిచేస్తున్నందున అక్కడి స్థితిగతులు వారికి తెలిసి ఉంటుందని గ్రామాల్లో పారిశుధ్యం మెరుగుపరుచుటకు ఏ విధంగా కార్యక్రమాలు చేపడితే బాగుంటుందని కార్మికులను వివరాలు అడిగి తెలుసుకున్నా మన్నారు. ఈ కార్యక్రమంలో డిఆర్ఓ పి వెంకటరమణ, డిపిఓ నాగేశ్వర్ నాయక్, ఆర్డ్బ్లుఎస్ ఎస్ ఈ వెంకటరమణ, డిఆర్డిఏ పిడి పిఎస్ఆర్ ప్రసాద్ తదితర అధికారులు, వివిధ మండలాల నుండి పారిశుధ్య కార్మికులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

36 ఏళ్ల స్టీల్ ప్లాంట్ చరిత్రలో ఇలాంటి ఘటన జరగలేదు

-బాధిత కుటుంబాలకు అండగా ఉంటాం -మృతుల కుటుంబాలకు రూ. 25 లక్షల చొప్పున పరిహారం -కుటుంబంలో ఒకరికి ప్లాంట్ లో …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *