Breaking News

జగనన్న ఆరోగ్య సురక్ష వైద్య శిబిరాలను పర్యవేక్షించేందుకు జిల్లాస్థాయి అధికారుల నియామకం !!

-జిల్లా కలెక్టర్ పి. రాజాబాబు

మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త :
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమం జిల్లాలో సజావుగా నిర్వహించేందుకు జిల్లాస్థాయి అధికారులను వివిధ మండలాలకు పర్యవేక్షణ అధికారులుగా నియమిస్తూ కృష్ణాజిల్లా కలెక్టర్ పి. రాజాబాబు ఉత్తర్వులు జారీ చేశారు. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమంలో భాగంగా వైద్య శిబిరాలను జిల్లాలోని అన్ని మండలాలలో విజయవంతంగా నిర్వహించాలని కలెక్టర్ వారికి సూచించారు.

అవనిగడ్డ, నాగాయలంక, కోడూరు మండలాలను మత్స్యశాఖ సంయుక్త సంచాలకులు పర్యవేక్షిస్తారని, అలాగే గుడివాడ, గుడ్లవల్లేరు, ఉంగుటూరు మండలాలను గుడివాడ ఆర్డిఓ పర్యవేక్షించాలన్నారు. అలాగే ఉయ్యూరు, పామర్రు, పమిడిముక్కల మండలాలను ఉయ్యూరు ఆర్డిఓ పర్యవేక్షించాలన్నారు. పెదపారుపూడి, నందివాడ మండలాలను ఐసిడిఎస్ ప్రాజెక్ట్ డైరెక్టర్ పర్యవేక్షించాలని, మచిలీపట్నం గూడూరు మండలాలను కె.ఆర్.ఆర్.సి ప్రత్యేక డిప్యూటీ కలెక్టర్ పర్యవేక్షిస్తారు. చల్లపల్లి, ఘంటసాల, మోపిదేవి మండలాల్లో జిల్లా పశుసంవర్ధక శాఖ సంయుక్త సంచాలకులు పర్యవేక్షిస్తారు. పెడన, బంటుమిల్లి, కృత్తివెన్ను మండలాలను ముడా విసి పర్యవేక్షిస్తారు. పెనమలూరు, తోట్లవల్లూరు, కంకిపాడు మండలాలను ఏపీ ఎంఐపి ప్రాజెక్ట్ డైరెక్టర్ పర్యవేక్షిస్తారు. గన్నవరం, బాపులపాడు మండలాల్లో జరిగే జగనన్న ఆరోగ్య సురక్ష వైద్య శిబిరాలను జిల్లా పరిశ్రమల శాఖ జనరల్ మేనేజర్ పర్యవేక్షిస్తారని కలెక్టర్ పి.రాజాబాబు సూచించారు. జగనన్న ఆరోగ్య సురక్ష వైద్య శిబిరాలు గత నెల సెప్టెంబర్ 30 వ తేదీ నుండి వచ్చేనెల నవంబర్ 4వ తేదీ వరకు 45 రోజులు పాటు కొనసాగుతాయన్నారు.

ఈ కార్యక్రమాన్ని పర్యవేక్షించడమే కాకుండా ప్రతి రోజు ప్రజా సమ్మతిని నివేదించడం ఎంతో ముఖ్యమని కలెక్టర్ పి. రాజాబాబు తెలిపారు.
పై విషయాలను దృష్టిలో ఉంచుకుని, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి సమన్వయంతో జిల్లా స్థాయి అధికారులకు కేటాయించిన మండలాల్లో జగన్నన్న ఆరోగ్య సురక్ష వైద్య శిబిరాల ప్రతిష్టాత్మక కార్యక్రమాన్ని పర్యవేక్షించాలని కలెక్టర్ ఆదేశించారు,

పర్యవేక్షణ అధికారులు వైద్య శిబిరాలను సందర్శించి, షెడ్యూల్ ప్రకారం శిబిరాలను సజావుగా క్రియాశీలతను గమనించి, అదే రోజు జరుగుతున్నయా లేదా ఏమైనా లోటుపాట్లు ఉన్నాయా అనే నివేదికను తనకు సమర్పించాలని జిల్లా కలెక్టర్ ఆదేశించారు. మండల ప్రత్యేక అధికారుల సమన్వయం చేసుకొని ఆయా వైద్య శిబిరాలకు హాజరయ్యే వారికీ మెరుగైన వసతులు అందే విధంగా చూడాలని జిల్లా కలెక్టర్ సూచించారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

36 ఏళ్ల స్టీల్ ప్లాంట్ చరిత్రలో ఇలాంటి ఘటన జరగలేదు

-బాధిత కుటుంబాలకు అండగా ఉంటాం -మృతుల కుటుంబాలకు రూ. 25 లక్షల చొప్పున పరిహారం -కుటుంబంలో ఒకరికి ప్లాంట్ లో …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *