-కేసలి అప్పారావు
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములోని రాజకీయ నాయుకులు, పార్టీలు, బాలలను రాజకీయ ప్రచారాలకు, ప్రసంగాలకు, వేడుకలకు, ధర్నాలకు, ఊరేగింపులకు ఉపయోగిస్తే వారికి బాలల హక్కుల కమిషన్ నుండి సంజాయిషీ నోటీసులు జారీ చేసి, శాఖా పరమైన చర్యలు తీసుకోవటం జరుగుతుందని ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ చైర్ పర్సన్ కేసలి అప్పారావు మరియు సభ్యులు జంగం రాజేద్రప్రసాద్, త్రిపర్ణ ఆదిలక్ష్మి, ఎం. లక్ష్మి దేవి ఆదేశాలు జారీచేశారు.
ఈ రోజు మంగళగిరి లో బాలల హక్కుల కమిషన్ కార్యాలయం లో వారు మాట్లాడుతూ ఇటీవల కాలంలో కొంత మంది రాజకీయ నాయకులు మరియు కొన్ని రాజకీయ పార్టీలు వారు పసిపిల్లలను, విద్యార్థులను వారి పార్టీ కార్యా కలాపాలకు, సభావేదికలుకు, ధర్నాలకు, ఊరేగింపులకు, వినియోగించు కోవటం జరుగుతుందని మాకు ఫిర్యాదులు అందుతున్నాయని తెలిపారు.
బాలలు,పసి పిల్లలు ద్వారా కొంత మంది ప్రజా ప్రతినిదులును,వివిధ పార్టీల రాజకీయ నాయకులను అసభ్యకర పదజాలంతో, అసహ్యకర వ్యాఖ్యలతో బాలలుతో ప్రసంగాలు చేయించటం ద్వారా బాలల మనస్సు లో ఒక రకమైన చెడు అభప్రాయము ఏర్పడటం, పెడ త్రోవ పట్టి తప్పుడు మార్గాలు చేపట్టడం, చదువు పట్ల ఆశక్తి తగ్గి ఉద్యమాల వైపు అడుగులు పడే అవకాశంకు తావు ఇవ్వడం జరుగుతుందని తెలిపారు.
బాలల హక్కుల అంతర్జాతీయ ఒడంబిక ప్రకారం 18సం,, లోపు బాలలను చట్ట విరుద్ధమైన కార్యా కలపాలకు,సదస్సులకు,సమావేశాలకు భాగస్వామ్యం చేయకూడదని, రాజకీయ పార్టీలుకు ఉపయోగించరాదని, బాలల కోసం రూపొందించ బడిన చట్టాలను ప్రజా ప్రతినిదులు గౌరవించాలని , దుర్వినియోగం చేయారదని అలా బాలల హక్కుల రక్షణ , పరిరక్షణ విషయములో వారి హక్కులు ఉల్లంఘన చేసినట్టు సమాచారం వస్తె వారిపై సుమోటాగా తీసుకొని శాఖ పరమైన చర్యలు తీసుకోబడుననీ రాష్ట్ర బాలల హక్కుల కమిషన్ తీవ్ర హెచ్చరిక జారీ చేశారు.