Breaking News

బాల సదన్ భవనాన్ని ప్రారంభించిన పేర్ని

-పాల్గొన్న జిల్లా కలెక్టర్, జాయింట్ కలెక్టర్, నగర మేయర్

మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త :
జిల్లా మహిళాభివృద్ధి శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో దాతల సహకారంతో మచిలీపట్నంలో స్థానిక పోర్ట్ రోడ్లో నిర్మించిన “బాల సదన్” నూతన భవనాన్ని మచిలీపట్నం శాసనసభ్యులు పేర్ని వెంకట్రామయ్య నాని జిల్లా కలెక్టర్ పి రాజా బాబు, జాయింట్ కలెక్టర్ డాక్టర్ అపరాజిత సింగ్ , మేయర్ చిటికెన వెంకటేశ్వరమ్మ లతో కలిసి ప్రారంభించి, శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. దాతల వివరాలతో ఏర్పాటుచేసిన శిలాఫలకాన్ని కూడా ఆవిష్కరించారు. నూతన భవనంలో డార్మెటరీ రూములు, డైనింగ్ రూమ్, ఆఫీస్ రూమ్ వంటి సౌకర్యాలు కల్పించారు. ఈ సందర్భంగా వారు అనాధ బాలికలకు దాతల సహకారంతో నూతన వస్త్రాలు దుప్పట్లు పంపిణీ గావించారు. అనాధ పిల్లలను అక్కున చేర్చుకుని వారిని సంరక్షించేందుకు బాలసదనం ఏర్పాటు చేసినట్లు, అనాధలను ఈ విధంగా ఆదుకోవడంలో దాతల సహకారం మరువలేనిదని కలెక్టర్, ఎమ్మెల్యే తెలిపారు. బాలసదనంలో బాలికలకు అవసరమైన మౌలిక వసతులు డార్మిటరీలు, డైనింగ్ రూమ్, టాయిలెట్స్ సౌకర్యం కల్పించినట్లు, డార్మెటరీ రూములలో బాలికలకు దాతల సహకారంతో మంచాలు, బెడ్స్, దుప్పట్లు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. దాతలను ఎమ్మెల్యే కలెక్టర్ అభినందించి వారి దాతృత్వాన్ని కొనియాడారు. ఈ సందర్భంగా దాతలను కలెక్టర్ ఎమ్మెల్యే ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్లు మాడపాటి విజయలక్ష్మి, శీలం భారతి, స్థానిక కార్పొరేటర్ చిత్తజల్లు ప్రసన్న, ఐసిడిఎస్ పిడి ఎస్ సువర్ణ, సివిల్ సప్లై కార్పొరేషన్ డి ఎం  ధర్, నగర పాలక సంస్థ కమిషనర్ చంద్రయ్య, మున్సిపల్ మాజీ చైర్మన్ షేక్ సిలార్ దాదా, జిల్లా పరిశ్రమల అధికారి కే వెంకట్రావు, ఐడిఎఫ్ఎస్ ఫస్ట్ బ్యాంక్ మేనేజర్లు రవికుమార్, భార్గవ్, గోల్డ్ ప్రిన్స్ ప్రతినిధులు, పలువురు దాతలు తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

36 ఏళ్ల స్టీల్ ప్లాంట్ చరిత్రలో ఇలాంటి ఘటన జరగలేదు

-బాధిత కుటుంబాలకు అండగా ఉంటాం -మృతుల కుటుంబాలకు రూ. 25 లక్షల చొప్పున పరిహారం -కుటుంబంలో ఒకరికి ప్లాంట్ లో …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *