Breaking News

హిందీ, తెలుగు భాషలు రెండు కళ్ళు : డా. యార్లగడ్డ లక్ష్మీప్రసాద్

విశాఖపట్నం, నేటి పత్రిక ప్రజావార్త :
జాతీయభాష హిందీ, మాతృభాష తెలుగు ప్రాశస్త్యాన్ని నలుదిశలా చాటిచెప్పేందుకు తన వంతుగా నిరంతరం కృషి చేస్తానని పార్లమెంట్ మాజీ సభ్యులు, సాహితీవేత్త డాక్టర్. యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ అన్నారు. గురువారం విశాఖపట్నం ఆంధ్రా యూనివర్సిటీ హిందీ భవన్ లో జర్నలిస్ట్ సంఘ నాయకులు, సీనియర్ పాత్రికేయులు నిమ్మరాజు చలపతి రావు యార్లగడ్డ ను మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. ఈ సందర్బంగా యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ మాట్లాడుతూ హిందీ, తెలుగు భాషలు తనకు రెండు కళ్ళు లాంటివని, వాటి గొప్పతనాన్ని తెలియజెప్పే సాహితీ ప్రక్రియను కొనసాగిస్తానన్నారు. యార్లగడ్డ ఈ నెల 24న జరగనున్న తన 70 వసంతాల ఉత్సవాన్ని పురస్కరించుకొని ఆహ్వానపత్రికను చలపతిరావుకు, జర్నలిస్ట్ డి. హరనాథ్ కు అందజేశారు.అనంతరం ముందస్తు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ డాక్టర్ యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ ను సత్కరించారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్లేస్ మీరు చెప్పినా… నన్ను చెప్పమన్నా.. …కూటమి అభివృద్ధిపై చర్చకు రెడీ

-వైసీపీకి మంత్రి సవిత సవాల్ -మీటరు రోడ్డు కూడా వేయలేని అసమర్థులు -వైసీపీ నేతలపై మంత్రి సవిత విసుర్లు -ఉన్న …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *