Breaking News

రబీ సీజన్లో 65 వేల ఎకరాల ఇరిగేషన్ ప్రాజెక్టు కింద సాగునీటి విడుదల కు కార్యాచరణ ప్రణాళిక సిద్ధం

-రబీ సీజన్ పంటలకు సంవృద్ది గా సాగు నీరు అందించడం జరుగుతుంది
-రబీ సీజన్లో ప్రతి ఒక్క ఎకరాకి సాగునీరు అందించే విధంగా చర్యలు తీసుకోవడం జరిగింది
-నవంబర్ 30 లోగా ఖరీఫ్ సీజన్ పంటల కోతలు పూర్తి చేయాలి
-రబీ సీజన్ నాట్లు వేసేలా  డిసెంబర్ 1 నుంచి 10 వరకు రైతులలో అవగాహన కల్పించాలి
-డిసెంబర్ 31 నాటికి రబీ సీజన్ నాట్లు పూర్తి చెయ్యాలి..
-ప్యాడి బదులు మినుములు వేసే రైతులకు విత్తనాలు సబ్సిడీపై అందిస్తాం
-రైతుల పక్షాన ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డికి కృతజ్ఞతలు
– మంత్రులు వేణుగోపాల్, తానేటి వనిత

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
రాష్ట్రంలో ప్రతి ఎకరాకు సాగునీరు అందించే లక్ష్యంతో రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మార్గదర్శకత్వం లో ఇరిగేషన్ ప్రాజెక్టులు ద్వారా సాగునీరు అందించేందుకు చర్యలు తీసుకోవడం జరుగుతోందని, ఇందుకు రైతుల పక్షాన ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు తెలిపిన వ్యక్తం చేస్తున్నా అని బిసి సంక్షేమ, సమాచార పౌర సంబంధాల, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి, జిల్లా ఇంఛార్జి మంత్రి  సిహెచ్. శ్రీనివాస్ వేణుగోపాల కృష్ణ , హోం మంత్రి తానేటి వనిత లు పేర్కొన్నారు.

బుధవారం స్థానిక కలెక్టరేట్ లో రబీకి అవసరమైన సాగు నీరు (డిసెంబర్- 23 నుండి మార్చి-24 వరకు) సరఫరా కార్యాచరణ ప్రణాళిక పై జిల్లా స్థాయి నీటి పారుదల సలహా మండలి సమావేశం జిల్లా ఇంఛార్జి మంత్రి వేణుగోపాల్ కృష్ణ , హోం మంత్రి తానేటి వనిత ముఖ్య అతిథి హజరవ్వగా, జెడ్పీ చైర్మన్ విప్పర్తి వేణుగోపాల రావు, ఎంపి మార్గాని భరత్ రామ్, డిసిసిబి చైర్మన్ ఆకుల వీర్రాజు, ఎమ్మెల్యే లు జక్కంపూడి రాజా , సత్తి సూర్యనారాయణ రెడ్డి, జిల్లా వ్యవసాయ సలహా మండలి చైర్మన్ బూరుగుపల్లి సుబ్బారావు, ఇతర అధికారులు పాల్గొన్నారు. ఈ సమావేశం జిల్లా కలెక్టర్ డా కె. మాధవీలత అధ్యక్షతన జరిగింది.

ఈ సందర్భంగా జిల్లా ఇంఛార్జి మంత్రి సిహెచ్. శ్రీనివాస్ వేణుగోపాల్ కృష్ణ మాట్లాడుతూ, జిల్లాలో ప్రస్తుత రబీ సీజన్లో వరికి అనుకూలంగా ఉన్న 64,361 ఎకరాల సాగు విస్తీర్ణం కలిగిన భూములకు సాగునీరు అందించే క్రమంలో నీటి ఎద్దడి వచ్చినా ఎదుర్కునే విధంగా సమావేశంలో నిర్ణయం తీసుకోవడం జరిగిందన్నారు. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు ఏ ఒక్క ఎకరా భూమి కూడా నీటి లభ్యత లేని కారణంగా పంట వెయ్యకుండా ఉండకూడదు అని స్పష్టం చేశారు. అందుకు అనుగుణంగా అవసరమైన నిధులను సమకూర్చడం జరుగుతుందని హామీ ఇచ్చారన్నారు . నీటి లభ్యత ఎక్కడ ఉంది, వాటిని ఎలా సమీకరించి రైతుకి ఏ విధంగా బాసటగా నిలవగలం అనే ఆలోచనతో ఈ ప్రభుత్వం రైతుల పక్షాన ఆలోచన చెయ్యడం జరిగిందన్నారు. ఆ దృక్పథం నిర్వహించిన సమావేశంలో పలు అంశాలపై చర్చించి నట్లు మంత్రి వేణుగోపాల్ తెలిపారు. ఆమేరకు నవంబర్ నెలాఖరు నాటికి ఖరీఫ్ సీజన్ కోతలు పూర్తి చేసి, డిసెంబర్ 1 నుంచి 10 లోగా రబీ సీజన్ నాట్లు కోసం రైతులను సంసిద్ధం చెయ్యాల్సి ఉంటుందన్నారు. ఆమేరకు నాట్లు ప్రారంభించడం ద్వారా డిసెంబర్ 31 నాటికి నాట్లు పూర్తి చెయ్యడం సాధ్యం అవుతుంది అని పేర్కొన్నారు. ఖరీఫ్ సీజన్లో ఆలస్యంగా పంట వేసిన వారిని ఏ విధంగా రబీ కి సిద్దం చెయ్యగలమో అధికారులు చర్యలు చేపట్టాల్సి ఉందన్నారు. ఆమేరకు సమావేశంలో తీర్మానం చేశామన్నారు. అదేవిధంగా పోలవరం ప్రాజెక్టు కింద రైతుల అవసరాలకు అనుగుణంగా నీటి నిలువ ఏ విధంగా ఉంచాలనే అంశం కూడా చర్చించి, ఆమేరకు ప్రభుత్వానికి నివేదిక ఇవ్వాలని ప్రతిపాదించిన ట్లు మంత్రి వేణు పేర్కొన్నారు.

పోలవరం ప్రాజెక్ట్ త్వరితగతిన పూర్తి చేసి రైతుకు అన్ని విధాలా భరోసా ఇచ్చే క్రమంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం చిత్తశుద్దితో పని చేస్తున్నట్లు తెలిపారు. ఆమేరకు శాసన సభ్యులు, రైతు లు, రైతు సంఘాల నాయకులు సూచనలు, సలహాల మేరకు ప్రభుత్వానికి నివేదిక ఇవ్వాలని సమావేశంలో తీర్మానం చేసి నట్లు పేర్కొన్నారు. రబీ పంట పండిస్తామా ? లేదా? అనే ఆందోళనలో ఉన్న పత్రికల్లో కథనాలు, ప్రతి పక్షాల ఆరోపణలు పుల్ స్టాప్ పెడుతూ రైతులకు సకాలంలో సాగునీరు అందించడం దిశగా అడుగులు వేయడం జరిగింది. ఈమేరకు ముఖ్యమంత్రికి రైతుల పక్షాన ధన్యవాదాలు తెలియ చేస్తున్నాము అని పేర్కొన్నారు. ఇది రైతు ప్రభుత్వం అని, ఎవ్వరూ ఎన్ని విమర్శలు చేసినా, రైతుల పక్షాన నిలబడి పని చేస్తామని స్పష్టం చేశారు.

హోమ్ మంత్రి తానేటి వనిత మాట్లాడుతూ, ప్రతి ఒక్క నీటి బొట్టు వినియోగం చేసుకోవలసిన అవసరం ఉందని, ఆ క్రమంలో ప్రతి నియోజక వర్గ పరిధిలో ఆయకట్టు కు సాగు నీరు అందించే సామర్థ్యం పెంచుకోవాలని పేర్కొన్నారు.  గత సీజన్లో రైతులకు సకాలంలో సాగునీరు అందించగలిగామని, క్రమంలో రైతులు ఈ రబీ సీజన్లో ఆమేరకు సాగునీరు అందించాల్సి ఉంటుందన్నారు. బాధ్యత మనపై ఉందని హోం మంత్రి గుర్తు చేశారు. రైతు సంక్షేమ ప్రభుత్వ విధానంలో రైతు స్నేహ పూర్వక విధానం అమలు చేయడం జరుగుతోందని అన్నారు. రాబోయే రబీ సీజన్లో పూర్తి స్థాయిలో సాగు విస్తీర్ణం చేసేందుకు అవసరమైన నీటి వనరుల పంపిణీ చేయాల్సి ఉందన్నారు

జిల్లా కలెక్టర్ మాధవీలత మాట్లాడుతూ, ఖరీఫ్ సీజన్లో చివరి వరకు సాగు నీరు అందించి ఇరిగేషన్ అధికారులు ఎంతో సహకారం అందించినట్లు పేర్కొన్నారు. వర్షాభావ పరిస్థితుల  నేపథ్యంలో రానున్న రబీ సీజన్ డిసెంబర్ 1 నుంచి మార్చి నెలాఖరు వరకు జరగనున్న దృష్ట్యా సాగునీటి వనరుల కోసం ఈ సమావేశం లో చర్చించడం జరిగిందన్నారు.  ఈ క్రమంలో అందుబాటులో ఉన్న సాగునీరు వనరులతో ఏ విధంగా వినియోగం చేసుకోవడం వల్ల సమర్థవంతంగా రబీ కు సాగునీటి ని అందించగలమో చర్చించు కున్నాం అని పేర్కొన్నారు. ఆ మేరకు ప్రభుత్వానికి నివేదిక అందజేయ్యాడం జరుగుతోందని అన్నారు.. పోలవరం ప్రాజెక్టు వద్ద నీటి నిలువ చేయడం, మండల స్థాయి వ్యవసాయ సలహా మండలి సమావేశం రెండు సార్లు నవంబర్  నెలాఖరు, డిసెంబర్ రెండో వారంలో నిర్వహించి డిసెంబర్ నెలలో నాట్లు పూర్తి చేసేలా అవగాహన కల్పించడం పై తీర్మానం చేసి నట్లు పేర్కొన్నారు. లిఫ్ట్ ఇరిగేషన్ కింద మోటార్ల రిపేర్లు , క్రాస్ బండ్ ఏర్పాట్లు, డీ సిల్టింగ్, డీ వీడింగ్, షట్టర్స్) స్లూసెస్ పనులకు చెంది 20 పనులకు రూ.103.69 లక్షలతో ప్రతిపాదన చేశామన్నారు.

ఈ సందర్భంగా పార్లమెంట్ సభ్యులు మార్గాని భరత్ రామ్, జెడ్పీ చైర్మన్ విప్పర్తి వేణుగోపాల్, డిసిసిబి చైర్మన్ ఆకుల వీర్రాజు, ఎమ్మెల్యే జక్కంపూడి రాజా, సత్తి సూర్యనారాయణ రెడ్డి, రైతు ప్రతినిధులు తదితరులు పలు అంశాలను సమావేశం దృష్టికి తీసుకుని రావడం జరిగింది.

అంతకు ముందు గోదావరి తూర్పు డెల్టా (P.B.Cతో సహా) 2,64,507  ఎకరాలు , గోదావరి సెంట్రల్ డెల్టా కింద 1,72,000 ఎకరాలు,  గోదావరి వెస్ట్రన్ డెల్టా కింద 4,60,000 ఎకరాలు వెరసి గోదావరి డెల్టా సిస్టమ్ కింద నెట్ రబీ ఆయకట్టు  ద్వారా 8,96,507 ఎకరాలకు 91.35 టి ఎం సి సాగునీరు అందించాల్సి ఉంటుందన్నారు.  సాగునీటి అవసరాలకు 82.49 టిఎంసిలు అందుబాటులో ఉండగా, మిగిలిన 8.86 టిఎంసి  ల టర్న్ సిస్టమ్ (వరభాండి సిస్టమ్) నీటి పొదుపు అమలు ద్వారా 5.00 టీఎంసీలు, కాలువలపై క్రాస్ బండ్‌లను ఏర్పాటు చేయడం ద్వారా మరియు డీజిల్ పంపులను ఉపయోగించి నీటిని ఎత్తివేయడం ద్వారా పునరుత్పత్తి చేయబడిన  3.86 టీఎంసీలు నీటిని ఉపయోగించడం ద్వారా రబీ కొరతను తీర్చడానికి అనుబంధ చర్యలు చేపట్టడం జరుగుతుందని కార్యాచరణ ప్రణాళిక ను అధికారులు వివరించారు.

ఈ కార్యక్రమంలో పార్లమెంట్ సభ్యులు మార్గాని భరత్ రామ్, జెడ్పీ చైర్మన్ విప్పర్తి వేణుగోపాల్, డిసిసిబి చైర్మన్ ఆకుల వీర్రాజు, ఎమ్మెల్యే జక్కంపూడి రాజా, సత్తి సూర్యనారాయణ రెడ్డి, వ్యవసాయ సలహా మండలి చైర్మన్ బూరుగుపల్లి సుబ్బారావు, రైతు ప్రతినిధులు, ఇరిగేషన్ ఎస్సీ జి. శ్రీనివాస రావు, వ్యవసాయ అధికారి ఎస్. మాధవ రావు, తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

నాబార్డు క్రెడిట్ ప్లాన్ ఆవిష్కరించిన ముఖ్యమంత్రి చంద్రబాబు

-2026-27 సంవత్సరానికి రూ.5.11 లక్షల కోట్ల రుణ ప్రణాళిక అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : నాబార్డు క్రెడిట్ ప్లాన్ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *