-అన్ని రంగాలలో మహిళల ప్రాధాన్యత పెరిగింది: డా. ముంజ్‌పరా మహేంద్రభాయ్
రేణిగుంట, నేటి పత్రిక ప్రజావార్త :
భారత ప్రధాని నరేంద్ర మోడీ కలలుగన్న అభివృద్ధి భారత్ ప్రపంచ దేశాలతో పోటీపడి మన దేశానికి స్వాతంత్రం సిద్ధించి 100 సంవత్సరాలు కానున్న 2047 నాటికి ముందు వరసలో నిలవనున్నదని కేంద్ర మహిళా సంక్షేమం & చైల్డ్ డెవలప్‌మెంట్ & ఆయుష్ శాఖ సహాయ మంత్రి డా. ముంజ్‌పరా మహేంద్రభాయ్ పునరుద్గాటించారు.
శనివారం మధ్యాహ్నం రేణిగుంట రైల్వే కళ్యాణ మండపంలో నిర్వహించిన వికసిత్ భారత్ సంకల్పయాత్ర కార్యక్రమంలో మంత్రి ముఖ్య అతిథిగా పాల్గొని కేంద్ర ప్రభుత్వ పథకాల ప్రచార వాహనాన్ని జెండా ఊపి ప్రారంభించి, కేంద్ర ప్రభుత్వ పథకాలు తెలియజేసి వివిధ శాఖలు ఏర్పాటు చేసిన స్టాల్స్ ను సందర్శించి అక్కడే ఏర్పాటుచేసిన సభలో ప్రసంగించారు.
మంత్రి మాట్లాడుతూ 2047 నాటికి భారతదేశం స్వయం సమృద్ధి సాధించేలా అభివృద్ధి చెందడమే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం పని చేస్తున్నదని అన్నారు. గౌరవ ప్రధానమంత్రి గత మాసం నవంబర్ 15న జార్ఖండ్ నుండి వికసిత్ సంకల్ప భారత్ యాత్ర 30 వేల ప్రచార వాహనాలను ప్రారంభించారని, ప్రతి గ్రామపంచాయతీలో కేంద్ర ప్రభుత్వ పథకాలను వివరించనున్నారని, అర్హులై ఉండి కూడా ప్రభుత్వ పథకాల పొందని వారు ప్రచార వాహనం వద్దే దరఖాస్తులు చేసి అందించి సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. కార్డియాలజీ డాక్టర్ గా నేను అనారోగ్యం పాలై లక్షల ఖర్చులు పెట్టి ఆర్థికంగా ఎంతో మంది నష్టపోయిన వారిని చూశానని నేడు ఆ స్థితి లేదని, రూ. 5 లక్షల విలువ ఉచిత వైద్యంతో ఆయుష్మాన్ భారత్, గ్రామీణ ప్రజల త్రాగునీటి కష్టాలు తీర్చడానికి జలజీవన్ మిషన్ పథకంతో ఇంటింటికి నీటి కులాయి అందించడం, అన్నదాతలను ఆదుకోవడానికి కిసాన్ సమన్ యోజన, అతి తక్కువ ధరలకు మందులు అందేలా జన ఔషధీ కేంద్రాలు, ఒకే దేశం ఒకే రేషన్ కార్డు అనే నినాదంతో కోవిడ్ సమయం నుండి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన పథకంతో గత ఐదు సంవత్సరాలుగా ఉచితంగా రేషన్ పంపిణీ, పీఎం ఆవాస్ యోజన పథకంతో పేదలకు గృహాలు మంజూరు చేస్తున్నారని అన్నారు. మహిళలకు ఉజ్వల యోజనతో గ్యాస్ సిలిండర్లు, గర్భిణీ స్త్రీలకు మాతృ వందన యోజనతో ఐదు వేల ఆర్థిక సహాయం, ఆడపిల్లలు తల్లిదండ్రులకు బరువు కారాదని సుకన్య సమృద్ధి యోజన పొదుపు పథకం, విద్య కోసం కస్తూరిబా గాంధీ విద్యాలయాలు, అగ్రగామి చదువులకు ఉచితంగా ఫీజు సౌకర్యం వంటివి ప్రవేశపెట్టారని ఆడపిల్లలు ఉన్నత విద్యను అభ్యసించి ఆర్థికంగా ఎదగాలని కోరుకుంటున్నాను అని అన్నారు. నేడు ఢిల్లీ సచివాలయంలో 40 శాతం మంది మహిళ ఉద్యోగులు ఉన్నారని ఆర్మీ నేవీ వంటి వాటిల్లో మహిళల ప్రాధాన్యత పెరిగిందని యుద్ధ విమానాలలోనూ హెలికాప్టర్లలోను మహిళా పైలట్లు గా ఉన్నారని ఇది ప్రపంచంలోనే అధికంగా మహిళల ప్రాతినిధ్యం ఉందని అన్నారు. కేంద్ర ప్రభుత్వం నేడు ప్రతి గ్రామ పంచాయతీకి పంపుతున్న మోడీ గ్యారెంటీ పథకాలు సద్వినియోగం చేసుకోవాలని, 2047 నాటికి తిరుమల శ్రీ బాలాజీ ఆశీస్సులతో అభివృద్ధిలో ప్రపంచ దేశాలలో మొదటిదిగా నిలవాలని కోరుకుంటున్నానని అన్నారు.
ఆకట్టుకున్న కేంద్ర ప్రభుత్వ పథకాలకు సంబంధించిన స్టాల్స్ అంగన్వాడీలో అందిస్తున్న పౌష్టికాహారం పి ఎం పోషన్, పోషణ అభయాన్ , పోషణ మహా, పోషణ 2.0
దీన దయ్యాల అంత్యోదయ యోజన, ఉజ్వల సిలిండర్, పి ఎం ఉజ్వల యోజన
కేంద్ర సమాచార మరియు ప్రసార మంత్రిత్వ శాఖ, సెంట్రల్ బ్యూరో ఆఫ్ కమ్యూనికేషన్ ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వ పథకాలు ప్రదర్శన
ఆయుష్మాన్ భారత్ ఆరోగ్య మేలా, ఆయుష్మాన్ భారత్ ఆరోగ్య కార్డ్, ప్రధానమంత్రి మాతృత్వ వందన యోజన, ప్రధానమంత్రి మిషన్ ఇంద్రధనస్సు, మాతృత్వ అభయాన్, పి.ఎం. భారతీయ జనఔ ష ది పర్యోజన,
రైతు సంక్షేమం, ఇఫ్కో వ్యవసాయ సలహాలు, ఆధార్ సేవా కేంద్రం, ఎర్రమరెడ్డి పాలెం రాగి పాత్రల, జాతీయ ఉపాధి హామీ, జల జీవన్ మిషన్ వంటి పథకాలపై స్టాల్ ప్రదర్శనలు ఏర్పాటు చేశారు.
సభలో మంత్రి ప్రసంగం అనంతరం గౌరవ ప్రధానమంత్రి వర్చువల్ విధానంలో ప్రజలను ఉద్దేశించి మా సంకల్పం అభివృద్ధి చెందిన భారతదేశం అనే నినాదంతో ప్రసంగించారు.
రాష్ట్ర మహిళా శిశు సంక్షేమ శాఖ కమిషనర్, విజయకృష్ణన్, జిల్లా ఇన్చార్జి జాయింట్ కలెక్టర్ పెంచల్ కిషోర్ కేంద్రమంత్రికి స్వాగతం పలికారు.
ఈ కార్యక్రమంలో జిల్లా అధికారులు, మండల స్థాయి అధికారులు, రేణిగుంట సర్పంచ్ నగేష్ జడ్పిటిసి సంధ్యారాణి ఎంపీటీసీ కృష్ణమూర్తి భాజపా నాయకులు ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News