Breaking News

జిల్లాలో జనవరి  1 వ తేదీ నుంచి  8 వతేదీ వరకు పెన్షన్ పంపిణీ కార్యక్రమం…

-డిఆర్డిఏ పిడి  ఎన్ వివిఎస్ మూర్తి

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
ముఖ్యమంత్రి వై ఎస్ హగన్మోహన్ రెడ్డి  ఇచ్చిన హామీ మేరకు వై ఎస్ ఆర్ పింఛను కానుక పించనును ప్రస్తుతం ఇస్తున్న రు.2750/-లు నుండి 3,000/- రూపాయలకు పెంపుదల చేయడమైనది. పెరిగిన మొత్త వీటితో కూడిన పింఛను 2024 జనవరి 1 వ తేదీ నుంచి 8 వతేదీ వరకు జిల్లాలోని అన్ని మండలములోను పురపాలక సంఘాల్లోను పంపిణీ చేయడం జరుగుతుందని డిఆర్డిఏ పిడి  ఎన్ వి వి ఎస్ మూర్తి పేర్కొన్నారు. జనవరి 3వ తేదీన జిల్లాస్థాయి ఫింఛన్ల పంపిణీ కార్యక్రమము రాజమహేంద్రవరం జిల్లా కలక్టరు వారి కార్యాలయం నందు ఉదయం 11 గంటలకు జరుగుతుందాని, అదే రోజు రాష్ట్ర స్థాయి ఫింఛన్ల పంపిణీ కార్యక్రమం కాకినాడలో గౌరవ ముఖ్యమంత్రి చేతుల మీదుగా నిర్వహించడం జరుగుతుందని పేర్కొన్నారు. 3వ తేదీన జిల్లాస్థాయిలో జరుగు కార్యక్రమంలో జిల్లా మంత్రి, జిల్లా ఇన్చార్జి మంత్రి, జిల్లా కలెక్టర్ స్థానిక ప్రజా ప్రతినిధులు, అధికారులు కార్యక్రమంలో పాల్గొంటారని అన్నారు.

జిల్లాలో ప్రస్తుతం జిల్లాలో 18 రకాల పెన్షన్లు 2,44,840 ఉన్నాయని, వీటినిమిత్తం ప్రస్తుతం రు.67,57, 19,750/- పంపిణీ చేయడం జరుగుతుందన్నారు. వీటిలో 8 రకాల ఫింఛన్లను రు. 2750/-ల నుండి 3,000/- లకు పెంచడం ద్వారా ఫింఛన్ల పంపిణీ మొత్తం 72,66,42,000 రూపాయలకు పెరగనున్నదన్నారు. ప్రస్తుతం ఉన్న 2,44,840 లకు అదనముగా 6 నెలలకు ఒక సారి కొత్తగా మంజూరు అయ్యే ఫింఛన్లు మరొక 1000 వరకు ఉన్నాయన్నారు. వీటి వెరిఫికేషను జరుగుచున్నదని వీటితో మొత్తం పింఛన్లు సంఖ్య 2,54,000 వేలకు చేరుకోగా వీరి కొరకు పింఛన్లు పంపిణీ నిమిత్తం రు.75 కోట్లు ఖర్చు చేయడం జరుగుతుందన్నారు.

ఫింఛన్ల పంపిణీ కార్యక్రమము  ప్రజాప్రతినిధుల సమక్షములో ఈనెల 1 వతేది నుండి 8 వతేదీ వరకు ఆయా మండలాలు, , మున్సిపాల్టీల్లో ఈ దిగువ తెలిపిన తేదీలలో జరుగునని, పింఛన్ల పంపిణీ తేదీలను మండల పరిషత్ అభివృద్ధి అధికార్లు, మున్సిపల్ కమిషనర్లు వాలంటీర్ల ద్వారా ఇంటిటికీ సమాచారాము చేరావేస్తారన్నారు. మహిళా సంఘ సభ్యులు, వాలంటర్లు ఇంటింటికి వెళ్ళి ప్రతి పింఛను దారునికి వారి మండలం, మున్సిపాలిటీ లో పంపిణీ జరగు తేదీని తెలియజేస్తారని తెలిపారు.

పెన్షన్ పంపిణీ తేది వివరాలు:-
2024 జనవరి 1 వ తేది నిడదవోలు అర్బన్ లోను, 2వ తేదీ నిడదవోలు రూరల్, తాళ్లపూడి, గోకవరం, దేవరపల్లి మండలాల్లోను, 3వ తేది అనపర్తి, కడియం, సీతానగరం మండలాల్లోనూ, 4వ తేది పెరవలి,బిక్కవోలు, చాగల్లు, కొవ్వూరు రూరల్, కొవ్వూరు అర్బన్, రాజమండ్రి రూరల్, రాజమండ్రి అర్భన్ రాజానగరం, 5వ తేది గోపాలపురం, రంగంపేట, మండలాల్లోనూ, 6 వ తేది కోరుకొండ, నల్లజర్ల ఉండ్రాజవరం మండలాల్లోను పింఛను పంపిణీ కార్యక్రమం ఉంటుందని డిఆర్డిఏ పిడి ఎన్ వివిఎస్ మూర్తి తెలిపారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్లేస్ మీరు చెప్పినా… నన్ను చెప్పమన్నా.. …కూటమి అభివృద్ధిపై చర్చకు రెడీ

-వైసీపీకి మంత్రి సవిత సవాల్ -మీటరు రోడ్డు కూడా వేయలేని అసమర్థులు -వైసీపీ నేతలపై మంత్రి సవిత విసుర్లు -ఉన్న …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *