ఏలూరు, నేటి పత్రిక ప్రజావార్త :
ఏలూరు జిల్లాలో భారతీయ జనతా పార్టీ ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించింది. బిజెపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గారపాటి సీతారామాంజనేయ చౌదరి ఆధ్వర్యంలో జబర్దస్త్ కళాకారులు, ప్రముఖ సినీ గాయకులతో వినూత్న రీతిలో ప్రచారానికి శ్రీకారం చుట్టారు. కేంద్రంలోని ప్రధాని మోడీ బిజెపి ప్రభుత్వం గత తొమ్మిదిన్నర సంవత్సరాలుగా చేస్తున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను వివరిస్తూ వినోద కార్యక్రమాలతో ప్రత్యేకంగా తయారు చేయించిన ప్రచార వాహనాల ద్వారా ప్రజలకు వివరించనున్నారు. శుక్రవారం ఏలూరులోని శ్రీరామ్ నగర్ లో గల తపన ఫౌండేషన్ కార్యాలయం వద్ద బిజెపి ఎన్నికల ప్రచార వాహనాలకు బిజెపి నాయకులు పూజ కార్యక్రమాలు నిర్వహించిన అనంతరం జిల్లా అధ్యక్షులు చౌటపల్లి విక్రమ్ కిషోర్ చేతుల మీదుగా ప్రచార యాత్రకు జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా సినీ గేయ రచయిత అనంత శ్రీరామ్, జబర్దస్త్ కళాకారుడు అదిరే అభి మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా నేటి నుంచి ఈనెల 29వ తేదీ జబర్దస్త్ కళాకారులు, సినీ గాయకులతో బిజెపి చేసిన అభివృద్ధి గురించి ప్రచారం నిర్వహిస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో గారపాటి రేణుక, జబర్దస్త్ కళాకారులు అదిరే అభి, అప్పారావు, బాబీ, వినోదిని, ఇమ్మాన్యుయేల్ సినీ గాయకులు లాస్య ప్రియ, అరుణ్ కౌండిన్య ,ప్రముఖ సినీ గేయ రచయిత అనంత శ్రీరామ్, పార్లమెంట్ కన్వీనర్ కట్నేని లక్ష్మీ కృష్ణ ప్రసాద్, గుమ్మడి చైతన్య, గాది రాంబాబు, నగరపాటి సత్యనారాయణ, నాగం శివ తదితరులు పాల్గొన్నారు.
Tags Eluru
Check Also
ప్లేస్ మీరు చెప్పినా… నన్ను చెప్పమన్నా.. …కూటమి అభివృద్ధిపై చర్చకు రెడీ
-వైసీపీకి మంత్రి సవిత సవాల్ -మీటరు రోడ్డు కూడా వేయలేని అసమర్థులు -వైసీపీ నేతలపై మంత్రి సవిత విసుర్లు -ఉన్న …
Prajavartha Online Telugu News