Breaking News

హౌస్ సైట్స్ రిజిస్ట్రేషన్లు క్యాంపెయిన్ విధానంలో సత్వరమే పూర్తి చేయాలి

-ఆరోగ్యశ్రీ కార్డులు పంపిణీ రెండు రోజుల్లో పూర్తి కావాలి: జిల్లా కలెక్టర్ డా. జి. లక్ష్మీశ

తిరుపతి,  నేటి పత్రిక ప్రజావార్త :
హౌస్ సైట్స్ రిజిస్ట్రేషన్లు రేపు ఉదయం నుండి క్యాంపెయిన్ మోడ్ లో ప్రారంభం కావాలని, నివేదికలను ఉదయం నుండి పరిశీలించడం జరుగుతుందని, సత్వరమే పూర్తి చేయాలని, అలాగే ఆరోగ్యశ్రీ కార్డులను, ఆయుష్మాన్ భారత్ కార్డులను రెండు రోజుల్లో లబ్ధిదారులకు ఈకెవైసి తో శత శాతం పంపిణీ చేయాలనీ జిల్లా కలెక్టర్ డా.జి. లక్ష్మీశ అధికారులను ఆదేశించారు.

శుక్రవారం రాత్రి జెసి శుభం బన్సల్, డిఆర్ఓ పెంచల కిషోర్, డి ఎం హెచ్ ఓ శ్రీహరి, జిల్లా గ్రామ వార్డు సచివాలయం అధికారిని లతో కలసి మండల తహశీల్దార్లు, యంపిడిఓలు, పంచాయతీ, సెక్రటరీ లు,ఈఓపిఆర్డిల తో జిల్లా కలెక్టర్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ పంచాయతీ సెక్రటరీలు, విఆర్ఓ లు సమన్వయం చేసుకొని హౌస్ సైట్స్ రిజిస్ట్రేషన్ వంద శాతం పూర్తి చేయాలని ఆదేశించారు.

జిల్లాకు వచ్చిన సుమారు నాలుగు లక్షల పై చిలుకు ఆరోగ్యశ్రీ కార్డులను యంపిడిఓ, మునిసిపల్ కమీషనర్ లకు పంపిణీ చేయడం జరిగిందని, మునిసిపల్ కమీషనర్లు, యంపిడిఓ లు పంచాయతీ సెక్రెటరీ ల ద్వారా వంద శాతం ఈ కె వై సి పూర్తి చేసి రెండు రోజుల్లో ఆరోగ్యశ్రీ కార్డులను, ఆయుష్మాన్ భారత్ కార్డులను వంద శాతం పంపిణీ చేయించాలని అధికారులను ఆదేశించారు.

జిల్లా కలెక్టరేట్ వీడియో కాన్ఫరెన్స్ హాల్ నుండి ఆరోగ్యశ్రీ జిల్లా మేనేజర్ శివకుమార్, డియల్డిఓలు వాణి , ఆదిశేషారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

నాబార్డు క్రెడిట్ ప్లాన్ ఆవిష్కరించిన ముఖ్యమంత్రి చంద్రబాబు

-2026-27 సంవత్సరానికి రూ.5.11 లక్షల కోట్ల రుణ ప్రణాళిక అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : నాబార్డు క్రెడిట్ ప్లాన్ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *