Breaking News

అహింసా సాంప్రదాయ సేవా హాస్పిటల్ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే కొడాలి నాని

-పేద వర్గాలకు చెందిన గర్భిణీ స్త్రీలకు పోషకాహార నిమిత్తం ఆర్థిక సహాయాన్ని అందజేసిన ఎమ్మెల్యే…..
-మహిళమ్మ తల్లుల ఆరోగ్య సంరక్షణకు ప్రభుత్వం అందిస్తున్న సేవలను ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోవాలి-ఎమ్మెల్యే కొడాలి నాని

గుడివాడ , నేటి పత్రిక ప్రజావార్త :
దేవదాయ ధర్మాదాయ శాఖకు చెందిన  అహింస సాంప్రదాయ సేవా హాస్పటల్ ఆధ్వర్యంలో మెయిన్ రోడ్డులో గల సేవా హాస్పటల్ ప్రాంగణంలో పేద వర్గాలకు చెందిన గర్భిణీ స్త్రీల పోషకాహార నిమిత్తం నిర్వహించిన ఆర్థిక సహాయ పంపిణీ కార్యక్రమంలో ఎమ్మెల్యే కొడాలి నాని పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఒక్కొక్కరికి వెయ్యి రూపాయలు చొప్పున 206 మంది మహిళలకు ఆర్థిక సహాయ పంపిణీ కార్యక్రమాన్ని ఎమ్మెల్యే కొడాలి నాని ప్రారంభించారు. తోలుత సేవా హాస్పటల్ వ్యవస్థాపకుడు గూడూరు రామచంద్రరావు చిత్రపటానికి ఎమ్మెల్యే నాని నివాళులర్పించారు. ఈ సందర్భంగా జరిగిన సభలో ఎమ్మెల్యే నాని మాట్లాడుతూ మహానుభావుడు గూడూరు రామచంద్రరావు శతాబ్దం క్రితం, మహిళలు బిడ్డకు జన్మనివ్వవ్వాలంటే పునర్జన్మ లాంటి నాటి రోజుల్లో తల్లులకు సహాయంగా పోషకాహారం నిమిత్తం ఆర్థిక సహాయ పంపిణీ కార్యక్రమాన్ని మొదలుపెట్టడం గొప్ప కార్యక్రమం అన్నారు.1929లోనే మహిళల పట్ల ఉన్నత ఆలోచనలతో ఇంతటి గొప్ప కార్యక్రమాలు నిర్వహించిన రామచంద్రరావుని ప్రతి ఒక్కరు అభినందించాలన్నారు. ఆయన పేరు మీద నేటికి కొనసాగుతున్న ఇంతటి మంచి కార్యక్రమంలో పాల్గొనడం సంతోషకరమని ఎమ్మెల్యే నాని హర్షం వ్యక్తం చేశారు. మహిళమ్మ తల్లుల ఆరోగ్య సంరక్షణకు సీఎం జగన్ నాయకత్వంలోని వైసిపి ప్రభుత్వం నిర్వహిస్తున్న కార్యక్రమాలు, అందిస్తున్న సహాయాలను ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే కొడాలి నాని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో దేవదాయ శాఖ ఈవోలు ఉయ్యూరు సుధాకర్, నటరాజన్ షణ్ముగం, సురేష్, కె.వి గోపాలరావు, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మండలి హనుమంతరావు, జిల్లా యూత్ అధ్యక్షుడు మెరుగుమాల కాళీ, పట్టణ మహిళా సమాఖ్య అధ్యక్షురాలు మాదాసు వెంకటలక్ష్మి,  భీమేశ్వర స్వామి వారి దేవస్థాన అభివృద్ధి కమిటీ చైర్మన్ చంద్రాల హరి రాంబాబు, ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ అధికారి పద్మావతి, దేవదాయ శాఖ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ 2026 కొత్త నియమావళి ప్రకారం నగరంలోని నాలుగు రంగుల చెత్తబుట్టలను ఏర్పాటు చేయండి

-విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ 2026 కొత్త …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *