-ప్రజా రవాణా వ్యవస్థలో కీలకమైన ఆర్టీసీ…మరింత మెరుగైన సేవలు ప్రజలకు అందించాలి -ఎమ్మెల్యే కొడాలి నాని
-గుడివాడ ఆర్టీసీ బస్టాండ్ అభివృద్ధికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది-చైర్మన్ మహేష్
గుడివాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ఏపీఎస్ఆర్టీసీ జోనల్ చైర్మన్, డైరెక్టర్ అయిన పిన్నింటి మహేష్ ,గుడివాడ పట్టణం రాజేంద్రనగర్ లోని ఆయన స్వగృహంలో ఎమ్మెల్యే కొడాలి నానిను గురువారం మర్యాదపూర్వకంగా కలిశారు.ఈ సందర్భంగా ఆర్టీసీ ఉద్యోగులతో కలిసి చైర్మన్ మహేష్, ఎమ్మెల్యే నానికు గౌరవ సత్కారం చేశారు. ఈ సందర్భంగా గుడివాడ ఆర్టీసీ బస్టాండ్ అభివృద్ధి పనులపై, మహేష్ తో ఎమ్మెల్యే కొడాలి నాని కొద్దిసేపు మాట్లాడారు.ప్రజా రవాణలో ఆర్టీసీ వ్యవస్థదే కీలక పాత్రని, ఎన్నో ఏళ్ల నుంచి ప్రజలకు రవాణ సేవలు అందిస్తున్న ఆర్టీసీ మరింత మెరుగైన సేవలు ప్రజలకు అందించేలా చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా ఎమ్మెల్యే కొడాలి నాని అన్నారు.ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడమే కాకుండా ఆ సంస్థ అభివృద్ధికి సీఎం జగన్ అనేక చర్యలు తీసుకున్నారని , ఆయన తీసుకున్న కీలక నిర్ణయాలతో అప్పుల్లో ఉన్న ఆర్టీసీ.. అభివృద్ధి పథంలో దూసుకెళ్తుందని ఎమ్మెల్యే కొడాలి నాని పేర్కొన్నారు. సీఎం జగన్ నాయకత్వంలోని వైసిపి ప్రభుత్వం ఆర్టీసీ అభివృద్ధికి ప్రత్యేక దృష్టి సారించిందని చైర్మన్ మహేష్ అన్నారు.గుడివాడ ఆర్టీసీ బస్టాండ్ అభివృద్ధికి ప్రభుత్వం అన్ని విధాలుగా చర్యలు తీసుకుంటుందని మహేష్ తెలియచేశారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ ఎంప్లాయిస్ అసోసియేషన్ డిఫ్యూటీ జనరల్ సెక్రటరీ దారం ఏడుకొండలు, గుడివాడ డిపో ఎంప్లాయిస్ అసోసియేషన్ నాయకులు సివికే రావు, మూర్తి, ఇమ్మానియోల్, కుమార్,మేరుగుమాల ఆంజనేయులు, శివప్రసాద్,ఆర్టీసీ ఉద్యోగులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News