Breaking News

గుంటూరు జిల్లా అదనపు ఎస్పీకి అభినందనలు

గుంటూరు , నేటి పత్రిక ప్రజావార్త :
గుంటూరు జిల్లా అదనపు ఎస్పీగా బాధ్యతలు స్వీకరించిన అత్యంత ఆప్తులు జీవి రమణమూర్తి ని బుధవారం టెలికాం సలహా కమిటీ, ఉమ్మడి గుంటూరు జిల్లా సభ్యులు మరియు ఏపీయూడబ్ల్యూజే ఉమ్మడి రాష్ట్ర కార్యదర్శి ( 1990-1998) నిమ్మరాజు చలపతిరావు మర్యాదపూర్వకంగా కలిసి అభినందించారు. వీరి వెంట యూనియన్ గుంటూరు అర్బన్ కమిటీ ఈసీ మెంబర్ బి పరశ్యాం ఉన్నారు. రమణమూర్తి 1989లో ఎస్సైగా పోలీస్ శాఖలో ప్రవేశించి బదిలీ అయ్యారు గుంటూరుకు రాకముందు విజయవాడలో విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ లో అడిషనల్ పోలీస్ కమిషనర్ గా విధులు నిర్వర్తించారు. తన సుదీర్ఘ పదవి కాలంలో విజయవాడ వరంగల్ హైదరాబాద్ మచిలీపట్నం తిరువూరు అవనిగడ్డ తెనాలి, నందిగామ తుని ప్రాంతాల్లో వివిధ హోదాల్లో వివిధ విభాగాల్లో సమర్థవంతంగా బాధ్యతలు నిర్వహించి విశేష ఆదరణ పొందారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

చిరంజీవి జన్మదిన వారోత్సవాల్లో ముఖ్య అతిథిగా డా. పసుపులేటి హరిప్రసాద్

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : మెగాస్టార్ చిరంజీవి జన్మదినాన్ని పురస్కరించుకుని గుంటూరులో నిర్వహిస్తున్న జన్మదిన వారోత్సవాల్లో భాగంగా జరిగిన …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *