-కమిటీ సభ్యులకు శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే కొడాలి నాని…
-ప్రభుత్వ సొమ్ముతో దేవాలయాలు అభివృద్ధి చేస్తున్న ఘనత స్వతంత్ర భారతావనిలో సీఎం జగన్ ప్రభుత్వానిదే….
-గత ప్రభుత్వాలు చేయనివిధంగా ప్రభుత్వ సొమ్ముతో, గుళ్ళలో దూప దీప నైవేద్యాలు…
-దైవభక్తి ఉంటే తప్పు చేయాలన్న ఆలోచనలు తగ్గుతాయి… మత విశ్వాసాలకు అనుగుణంగా ప్రతి ఒక్కరూ దైవభక్తి కలిగుండాలి
గుడివాడ, నేటి పత్రిక ప్రజావార్త :
గుడివాడ పట్టణం జగన్నాధపురంలో వేంచేసియున్న శ్రీ భూ నీలా సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవస్థాన ధర్మకర్తల కమిటీ ప్రమాణ స్వీకార కార్యక్రమాలు శనివారం ఘనంగా జరిగాయి. ఎమ్మెల్యే కొడాలి నాని సమక్షంలో నూతన ధర్మకర్తల కమిటీ సభ్యులు దేవాదాయ శాఖ నిబంధనల ప్రకారం ప్రమాణ స్వీకారం చేసి బాధ్యతలు చేపట్టారు. అధ్యక్షుడు డొక్కు రాంబాబు,ఇతర కమిటీ సభ్యులకు ఎమ్మెల్యే కొడాలి నాని శుభాకాంక్షలు తెలియచేశారు. తొలుత ప్రమాణ స్వీకార కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చిన ఎమ్మెల్యే కొడాలి నానికు దేవస్థాన సాంప్రదాయం ప్రకారం, అధికారులు గౌరవ స్వాగతం పలికారు. వేద పండితుల మంత్రోచ్చరణల మధ్య స్వామి వారికి ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించిన ఎమ్మెల్యే కొడాలి నానికు,వేద పండితులు వేద ఆశీర్వచనాలు ఇస్తు, స్వామివారి ప్రసాదం అందచేసి దేవస్థాన సంప్రదాయం ప్రకారం సత్కరించారు. ఈ సందర్భంగా దేవస్థాన మండపం వద్ద జరిగిన కమిటీ అభినందన సభలో ఎమ్మెల్యే కొడాలి నాని మాట్లాడుతూ. ఆధ్యాత్మిక చింతన కలిగిన వ్యక్తులనే దేవాలయ కమిటీ సభ్యులుగా ఎంపిక చేస్తున్నామన్నారు. రాష్ట్రంలోని వైఎస్ఆర్సిపి ప్రభుత్వం హిందూ మతానికి వ్యతిరేకమనే , తప్పుడు సంకేతాలను ప్రజల్లో కల్పించేలా ప్రతిపక్షాలు కుట్రలు చేస్తున్నాయని ఎమ్మెల్యే నాని మండిపడ్డారు.కృష్ణ పుష్కరాల పేరుతో గత ప్రభుత్వం 40 దేవాలయాలను కూల్చివేస్తే, వైసీపీ ప్రభుత్వ హయాంలో ప్రభుత్వ నగదుతో చంద్రబాబు కూల్చివేసిన, దేవాలయాలను సీఎం జగన్ పునర్ నిర్మించారని కొడాలి నాని తెలియచేశారు. స్వతంత్రం వచ్చిన తర్వాత దేవాలయాల అభివృద్ధికి, దేవదాయ శాఖ డబ్బులు కాకుండా, ప్రభుత్వ డబ్బులు వినియోగించిన ఏకైక సీఎం జగన్ మాత్రమేనని ఎమ్మెల్యే కొడాలి నాని అన్నారు. మన సమీపంలోని విజయవాడ శ్రీ కనకదుర్గ అమ్మవారి దేవస్థానంలో ప్రభుత్వం విడుదల చేసిన 75 కోట్లతో మెరుగైన వసతుల కల్పన ఏర్పాట్లు జరుగుతున్నాయని ఆయన అన్నారు. గుడివాడలో పెద్ద శివాలయం అభివృద్ధికి రెండు కోట్లు, జొన్నపాడు శివాలయం పునర్నిర్మాణానికి ప్రభుత్వం 70 కోట్లు మంజూరు చేసిందన్నారు. గత ప్రభుత్వాలు కేవలం దేవాలయాల అభివృద్ధికి, దేవదాయ శాఖ నిధులు మాత్రమే వినియోగించేవారన్నారు. ఎన్నికలు సమీపిస్తున్న వేళ కులాలు, మతాల మధ్య రేచ్చగోట్టే ప్రయత్నాలను ప్రతిపక్షాలు చేస్తున్నాయని, చంద్రబాబు ఎప్పుడు చెప్పే డబ్బా కబుర్లను ప్రజలు నమ్మవద్దని కొడాలి నాని విజ్ఞప్తి చేశారు. దేవాలయాల వైభవాన్ని మరింత పెంపొందించేలా కమిటీలు పని చేయాలని సూచించారు. ప్రజలందరిపై భగవంతుని ఆశీస్సులు ఉండాలని ఎమ్మెల్యే కొడాలి నాని ఆకాంక్షించారు.అనంతరం కమిటీ చైర్మన్ రాంబాబు,ఎమ్మెల్యే కొడాలి నానిలను ధార్మిక సంస్థల సభ్యులు గజమాలలు,శాలువాలతో సత్కరించారు. కమిటీ సభ్యులు వంగపండు బ్రహ్మాజీ, అంకెం ధనలక్ష్మి, దొండపాటి కృష్ణారావు, మామిళ్ళపల్లి రమ్య రెడ్డి, గుమ్మడి నాగేంద్ర, తాడిపర్తి సునీతలను వైసిపి నేతలు,భక్తులు పులమాలలతో అభినందనలు తెలిపారు.ఈ కార్యక్రమంలో దేవస్థాన ఇఓ నటరాజన్ షణ్ముగం,వైసిపి రాష్ట్ర నాయకులు దుక్కిపాటి శశి భూషణ్,పట్టణ వైసిపి అధ్యక్షుడు గొర్ల శ్రీను, జిల్లా ఉపాధ్యక్షుడు మండలి హనుమంతరావు, పాలేటి చంటి, జిల్లా యువజన విభాగ అధ్యక్షుడు మెరుగుమాల కాళీ,వైసిపి నాయకులు రావులకొల్లు సుబ్రమణ్యం,తోట శివాజీ, దారం ఏడుకొండలు, పొట్లూరి మురళీధర్, జిల్లా రఘు, చందరాల హరి రాంబాబు, రమణ కుమార్, అగస్త్యరాజు కృష్ణమోహన్, పర్వతనేని ఆనంద్, లోయ రాజేష్, బంటుమిల్లి సూర్యనారాయణ, గంటా సురేష్, రేమల్లి నీలాకాంత్, సయ్యద్ గఫార్, జోగా సూర్యప్రకాశరావు, బోగ్గరపు తిరుపతయ్య, గంట ఆనంద్,గులిపల్లి ప్రభాకరరావు, వేంపల అప్పారావు, కోర్నిపాటి గణపతి, డాక్టర్ ఆర్కే, తోట నాగరాజు, కందుల నాగరాజు ,గంట చంద్రశేఖర్,డాక్టర్ బండారు శ్యామ్ కుమార్, ఘంటా శ్రీనివాస రావు,వేంపటి సైమన్, పాలడుగు రాంప్రసాద్,ముడెడ్ల ఉమా, అల్లం రామ్మోహనరావు, కొలుసు శివ,పలు స్వచ్ఛంద , ధార్మిక సంస్థల సభ్యులు, పెద్ద సంఖ్యలో భక్తులు, దేవదాయ శాఖ సిబ్బంది పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News