Breaking News

ఘనంగా జరిగిన పోలుకొండ సిఎస్ఐ చర్చ్ వార్షికోత్సవ వేడుకలు….. పాల్గొన్న ఎమ్మెల్యే కొడాలి నాని

-మానవాళి హితం కోరుతూ నిర్వహించిన ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొన్న ఎమ్మెల్యే నాని
-దేవదేవుడి ఆశీస్సులతో ప్రజలందరూ సుభిక్షంగా ఉండాలని ఆకాంక్షించిన ఎమ్మెల్యే కొడాలి నాని

నందివాడ, నేటి పత్రిక ప్రజావార్త :
నందివాడ మండలం పోలుకొండ గ్రామంలోని సి.ఎస్.ఐ చర్చ్ 9వ వార్షికోత్సవ వేడుకలు శనివారం ఘనంగా జరిగాయి. వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్యే కొడాలి నాని సీఎస్ఐ పాస్టర్లు, క్రైస్తవ విశ్వాసులకు వార్షికోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా మానవాళి హితం కోరుతూ నిర్వహించిన ప్రత్యేక ప్రార్థనల్లో ఎమ్మెల్యే కూడా నాని పాల్గొన్నారు. అనంతరం ఎమ్మెల్యే కొడాలి నాని మాట్లాడుతూ చర్చ్ వార్షికోత్సవ వేడుకల్లో పాల్గొని, దేవుడికి, మనకు మధ్య వారదులుగా ఉన్న పాస్టర్లతో కలిసి ప్రార్థనలో పాల్గొనడం సంతోషకరమని హార్షం వ్యక్తం చేశారు. ప్రజలందరు నిండు నూరేళ్లు, తమ కుటుంబ సభ్యులతో సుఖసంతోషాలతో జీవించేలా లోక రక్షకుడైన ప్రభువు అనుగ్రహం ఉండాలని ఎమ్మెల్యే నాని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా చర్చ్ కమిటీ పెద్దలు ఎమ్మెల్యే కొడాలి నానికు గౌరవ సత్కారం చేశారు.ఈ కార్యక్రమంలో ఎంపీపీ పెయ్యల ఆదాం, సి.ఎస్.ఐ చర్చ్ కమిటీ పెద్దలు వల్లి లోకేశ్వరం, మానేపల్లి నాగేశ్వరరావు, దోమతెర శెట్టి, పిట్టా ప్రసన్న, చుండూరు ప్రకాష్, పాస్టర్ ఎలిషా రావు,వైసీపీ నాయకులు తోటా నాగరాజు, కందుల నాగరాజు, పలువురు దైవసేవకులు, పెద్ద సంఖ్యలో క్రైస్తవ విశ్వాసులు, పోలు కొండ గ్రామ పెద్దలు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్లేస్ మీరు చెప్పినా… నన్ను చెప్పమన్నా.. …కూటమి అభివృద్ధిపై చర్చకు రెడీ

-వైసీపీకి మంత్రి సవిత సవాల్ -మీటరు రోడ్డు కూడా వేయలేని అసమర్థులు -వైసీపీ నేతలపై మంత్రి సవిత విసుర్లు -ఉన్న …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *