Breaking News

శ్రీ గౌరీశంకర స్వామి వారి ధర్మకర్తల కమిటీ ప్రమాణ స్వీకారోత్సవం….పాల్గొన్న ఎమ్మెల్యే కొడాలి నాని…

-నూతన కమిటీ సభ్యులకు శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే కొడాలి నాని…
-రాష్ట్రంలో దేవాలయాల అభ్యున్నతికి సీఎం జగన్ ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తుంది….
-ప్రజల్లో భక్తి భావన పెంపొందించేలా దేవాలయాల్లో ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహించాలి…. అప్పుడే తప్పు చేయాలన్న భావన ప్రతి ఒక్కరిలో తొలగిపోతుంది

గుడివాడ, నేటి పత్రిక ప్రజావార్త :
గుడివాడ పట్టణం గౌరీ శంకరపురంలో వేంచేసియున్న శ్రీ గౌరీ శంకర స్వామి వారి దేవస్థాన ధర్మకర్తల కమిటీ ప్రమాణ స్వీకార కార్యక్రమాలు శనివారం సాయంత్రం ఘనంగా జరిగాయి. ఎమ్మెల్యే కొడాలి నాని సమక్షంలో నూతన ధర్మకర్తల కమిటీ సభ్యులు దేవాదాయ శాఖ నిబంధనల ప్రకారం ప్రమాణ స్వీకారం చేసి బాధ్యతలు చేపట్టారు. అధ్యక్షుడు డాక్టర్ బండారు శ్యామ్ కుమార్,ఇతర కమిటీ సభ్యులకు ఎమ్మెల్యే కొడాలి నాని శుభాకాంక్షలు తెలియచేశారు. తొలుత ప్రమాణ స్వీకార కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చిన ఎమ్మెల్యే కొడాలి నానికు దేవస్థాన సాంప్రదాయం ప్రకారం, అధికారులు గౌరవ స్వాగతం పలికారు. వేద పండితుల మంత్రోచ్చరణల మధ్య స్వామి వారికి ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించిన ఎమ్మెల్యే కొడాలి నానికు,వేద పండితులు వేద ఆశీర్వచనాలు ఇస్తు, స్వామివారి ప్రసాదం అందచేసి దేవస్థాన సంప్రదాయం ప్రకారం సత్కరించారు. ఈ సందర్భంగా దేవస్థాన మండపం వద్ద జరిగిన కమిటీ అభినందన సభలో ఎమ్మెల్యే కొడాలి నాని మాట్లాడుతూ. గత విడతలో బాధ్యతలు నిర్వహించిన ఇదే కమిటీ, అంకితభావంతో దేవస్థాన అభివృద్ధికి ఆదర్శప్రాయంగా కృషి చేశారని ఎమ్మెల్యే కొడాలి నాని కొనియాడారు. తిరిగి బాధ్యతలు చేపట్టిన గత కమిటీ సభ్యులు మళ్లీ విడతలో ప్రజల్లో భక్తి భావం పెంపొందించేలా, ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు. ప్రజల్లో ఆధ్యాత్మిక చింతన పెరిగితే తప్పు చేయాలని భావన ఉండదని ఎమ్మెల్యే కొడాలి నాని అన్నారు. అలాగే ధర్మకర్తల కమిటీలు దేవాలయాల వైభవాన్ని పెంపొందించేలా బాధ్యతలు చేపట్టిన కమిటీలు కృషి చేయాలని సూచించారు. ప్రజల్లో ఆధ్యాత్మిక చింతనలు పెంచే కార్యక్రమాలను నిర్వహించేందుకు కమిటీలు ప్రాధాన్యత ఇవ్వాలని ఎమ్మెల్యే కొడాలి నాని అన్నారు. అనంతరం కమిటీ
చైర్మన్ డాక్టర్ శ్యాం కుమార్, ధర్మకర్తల కమిటీ సభ్యులు వి. బాలకృష్ణమూర్తి,యన్. నగేష్, మూడేడ్ల ఉమా, రావుల కొల్లు హైమావతి, కే,వెంకటలక్ష్మి, కె.వి.నారాయణరెడ్డి,లకు ఎమ్మెల్యే కొడాలి నాని వైఎస్ఆర్సిపి నాయకులు, భక్తులు పూలమాలలు, శాలువాలతో అభినందనలు తెలిపారు.ఈ కార్యక్రమంలో దేవస్థాన ఇఓ నటరాజన్ షణ్ముగం,వైసిపి రాష్ట్ర నాయకులు దుక్కిపాటి శశి భూషణ్,పట్టణ వైసిపి అధ్యక్షుడు గొర్ల శ్రీను, జిల్లా ఉపాధ్యక్షుడు మండలి హనుమంతరావు, వైసీపీ నాయకులు పాలేటి చంటి, మాదాసు వెంకటలక్ష్మి, ఎంవి నారాయణరెడ్డి, చుండూరి శేఖర్,ఘంటా చంద్రశేఖర్, రావుల కొల్లు సుబ్రహ్మణ్యం, జోగా నాగేశ్వరరావు, అడపా జగదీష్, రమణ కుమార్, జోగా సూర్యప్రకాష్, సురేఖ,హారిక,పలు స్వచ్ఛంద , ధార్మిక సంస్థల సభ్యులు, పెద్ద సంఖ్యలో భక్తులు, దేవదాయ శాఖ సిబ్బంది పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్లేస్ మీరు చెప్పినా… నన్ను చెప్పమన్నా.. …కూటమి అభివృద్ధిపై చర్చకు రెడీ

-వైసీపీకి మంత్రి సవిత సవాల్ -మీటరు రోడ్డు కూడా వేయలేని అసమర్థులు -వైసీపీ నేతలపై మంత్రి సవిత విసుర్లు -ఉన్న …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *