నల్లజర్ల, నేటి పత్రిక ప్రజావార్త :
నల్లజర్ల మండలం ఆవపాడు గ్రామంలో రాష్ట్ర హోం మరియు విపత్తుల నిర్వహణ శాఖ మంత్రి డాక్టర్ తానేటి వనిత సమక్షంలో జనసేన పార్టీ నుంచి వైసీపీలోకి పలు కుటుంబాలు చేరాయి. యువతకు వైసిపి కండువాలు కప్పి హోం మంత్రి తానేటి వనిత పార్టీలోకి ఆహ్వానించారు. గ్రామంలో తోట నరేంద్ర, షేక్ రహిం, షేక్ బాబీ, బదిరెడ్డి ప్రసాద్, గందిపము జాను, కండెళ్ళి రాజేష్, ఈర్లపాటి ప్రసన్న తదితర కుటుంబాలు జనసేన నుండి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలోకి చేరాయి. ఈ సందర్భంగా హోంమంత్రి తానే ఎటువంటి మాట్లాడుతూ సమాజంలో మార్పు మొదలైందని తెలిపారు. జగనన్న ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు, చేస్తున్న అభివృద్ధి కి ఆకర్షితులై వివిధ పార్టీల నుండి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారని హోంమంత్రి తానేటి వనిత స్పష్టం చేశారు.
Tags amaravathi
Check Also
కృష్ణా జిల్లా అభివృద్ధి పనులపై సి ఎం ని కలిసిన ఎంపీ బాలశౌరి
మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : ఈరోజు అమరావతి లోని ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో మచిలీపట్నం పార్లమెంట్ సభ్యులు వల్లభనేని …