విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
విజయవాడ నగరపాలక సంస్థ ప్రధాన కార్యాలయంలో మంగళవారం 80- సెంట్రల్ అసెంబ్లీ నియోజకవర్గ ఎలక్ట్రోల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్ విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ తమ ఛాంబర్ లో రాజకీయ పార్టీలతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ముందుగా గతంలో నిర్వహించిన పొలిటికల్ పార్టీ సమావేశంలో రాజకీయ పార్టీలు ప్రతిపాదించిన అంశాలపై అధికారులు తీసుకున్న చర్యలుపై వివరించారు తదుపరి సెంట్రల్ నియోజకవర్గం పరిధిలోగల 26 పోలింగ్ కేంద్రాల పేర్లలో నెలకొన్న స్వల్ప సవరణల జాబితా కమిటీ ముందు ఉంచగా రాజకీయ పార్టీల ప్రతినిధులు తమ ఆమోదాన్ని తెలిపారు. ఈ సమావేశంలో తెలుగుదేశం పార్టీ ప్రతినిధి నవనీతం సాంబశివరావు, వైఎస్ఆర్సిపి పార్టీ ప్రతినిధి సుందర్ పాల్, సిపిఐ ప్రతినిధి వీరభద్రరావు, కాంగ్రెస్ పార్టీ ప్రతినిధి అన్సార్, విజయవాడ నగరపాలక సంస్థ చీఫ్ సిటీ ప్లానర్ జీవీ జీ ఎస్ వి ప్రసాద్, ఎస్ ఈ రామ్మోహన్ రావు తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News