Breaking News

వైసీపీ ప్రభుత్వంలోనే రాష్ట్రాభివృద్ధి జరిగిందని దమ్ముగా ధైర్యంగా చెప్పగలం : దేవినేని అవినాష్

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
రాష్ట్రంలో వైయస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాతనే అభివృద్ధి కార్యక్రమాలు వేగవంతంగా జరిగాయని, దళారి వ్యవస్థ ను రూపుమాపి అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందించామని దమ్ముగా చెప్పే ధైర్యం మాకుంది అని ఆ పార్టీ తూర్పు నియోజకవర్గ ఇన్ ఛార్జ్ దేవినేని అవినాష్ పేర్కొన్నారు. శనివారం నాడు 21వ డివిజన్ నందు జీవనోపాధి కి ఇబ్బందులు పడుతున్న ఆరు కుటుంబాలకు దేవినేని నెహ్రూ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా దాదాపు రూ.2,00,000,/- విలువ గల ఒకటి టిఫిన్ బండి, ఒకటి ఇస్త్రీ బండి, నాలుగు తోపుడు బండ్లు అవినాష్ ఉచితంగా అందజేశారు. ఈ సందర్భంగా అవినాష్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆశయాలకు అనుగుణంగా ప్రభుత్వం అందించే సంక్షేమ పథకాలతో పాటు పేద ప్రజలకు అండగా చారిటబుల్ ట్రస్ట్ ద్వారా అనేక సేవ కార్యక్రమాలు చేపడుతున్నట్టు తెలిపారు.ఈ కార్యక్రమంలో 21వ డివిజన్ కార్పొరేటర్ పుప్పాల కుమారి, డివిజన్ అధ్యక్షులు టి.పి రెడ్డి వైసీపీ నాయకులు దుర్గారావు, మద్దెల మల్లిక, పండు, ధనుంజయ్, గొర్ల గోవింద్, గౌరీ, రమేష్ తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

36 ఏళ్ల స్టీల్ ప్లాంట్ చరిత్రలో ఇలాంటి ఘటన జరగలేదు

-బాధిత కుటుంబాలకు అండగా ఉంటాం -మృతుల కుటుంబాలకు రూ. 25 లక్షల చొప్పున పరిహారం -కుటుంబంలో ఒకరికి ప్లాంట్ లో …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *