Breaking News

దేవినేని నెహ్రూ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా పలు డివిజన్ల సంబందిచి 20మందికి రూ.2,00,000/- విలువగల ఇస్త్రీ పెట్టెలు పంపిణీ

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
విజయవాడ నగరంలో విద్య, వైద్య,ఉపాధి రంగాలలో అవసరమైన ప్రతి ఒక్కరికి దేవినేని నెహ్రూ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా తగు సహాయం అందిస్తూ అండగా నిలుస్తున్నామని ట్రస్ట్ చైర్మన్, తూర్పు నియోజకవర్గ వైస్సార్సీపీ ఇన్ ఛార్జ్ దేవినేని అవినాష్ పేర్కొన్నారు.

దేవినేని అవినాష్ కామెంట్స్

ప్రభుత్వ పథకాలు అర్హులైన ప్రతి ఒక్కరికి అందేలా చర్యలు తీసుకోవడంతో పాటు దేవినేని నెహ్రూ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా సామాజిక సేవ కార్యక్రమాలు చేపడుతున్నాం మన దేవినేని నెహ్రూ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా విజయవాడ నగరంలో గత ఐదు సంవత్సరాలు గా విస్తృతంగా సామాజిక సేవ కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. ప్రభుత్వ పాఠశాలలో ఆర్వో మంచినీటి ప్లాంట్లు, పేద విద్యార్థులకు పుస్తకాల పంపిణీ, అవసరమైన వారికి ఫీజుల చెల్లింపు చేసి అండగా నిలబడ్డాము. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి సూచనల మేరకు పేదలకు జీవనోపాధి నిమిత్తం తోపుడు బండ్లు, ఇస్త్రీ బండ్లు, బడ్డి కోట్లు వితరణ చేయడం జరిగింది. అదేవిధంగా వైద్య సహాయం అవసరమైన వారికి ప్రభుత్వం ద్వారా తగు సహాయం అందేలా చేయడంతో పాటు మా ట్రస్ట్ ద్వారా కూడా తగు సహాయం అందిస్తున్నాం. రాబోయే రోజుల్లో కూడా ఇదేవిధంగా సేవ కార్యక్రమాలు చేపడుతూ అవసరమైన ప్రతి ఒక్కరికి అండగా నిలుస్తామని అవినాష్ తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర సీనియర్ నాయకులు కడియాల బుచ్చిబాబు, ఫ్లోర్ లీడర్ వెంకట సత్యనారాయణ,డిప్యూటీ బెల్లం దుర్గ,ఎన్టీఆర్ జిల్లా యువజన విభాగం అధ్యక్షులు కొరివి చైతన్య,కార్పొరేటర్ భీమిశెట్టి ప్రవల్లిక మరియు వివిధ కార్పొరేషన్ డైరెక్టర్లు,కార్పొరేటర్లు, ఇంఛార్జీలు,వైసీపీ ముఖ్య నాయకులు,కార్యకర్తలు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

36 ఏళ్ల స్టీల్ ప్లాంట్ చరిత్రలో ఇలాంటి ఘటన జరగలేదు

-బాధిత కుటుంబాలకు అండగా ఉంటాం -మృతుల కుటుంబాలకు రూ. 25 లక్షల చొప్పున పరిహారం -కుటుంబంలో ఒకరికి ప్లాంట్ లో …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *