Breaking News

మార్చి 11 వ తేదీ సోమవారం యధాతధంగా కలెక్టరేట్ లో జిల్లా స్థాయి స్పందన

-కలెక్టర్ డా కే.మాధవీలత

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
ప్రతి సోమవారం నిర్వహించే  జిల్లా, డివిజన్, మండల  స్థాయి స్పందన కార్యక్రమం మార్చి 11 వ తేదీ సోమవారం యధావిధిగా  నిర్వహిస్తున్నట్లు   జిల్లా కలెక్టర్ డా. కె. మాధవీలత ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. రాజమహేంద్రవరంలోని జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో సోమవారం నిర్వహించే స్పందన కార్యక్రమానికి అందరూ జిల్లా స్థాయి అధికారులు తప్పని సరిగా హాజరు కావాలని అన్నారు. అదేవిధంగా డివిజన్ స్థాయి లో ఆర్డీవో, మునిసిపల్ స్థాయి లో కమిషనర్లు, మండల స్థాయి అధికారులు, గ్రామ స్థాయి, గ్రామ, వార్డు సచివాలయాల నుంచి ప్రజలు నుంచి సంబంధిత సిబ్బంది ప్రజల నుంచి స్పందన అర్జీలు స్వీకరిస్తారని తెలిపారు. జిల్లా కలెక్టర్, ఇతర జిల్లా అధికారులు  ఉదయం 10.00 నుంచి మ.1.00 వరకు ఫిర్యాదులను కలెక్టరేట్ లో స్వీకరిస్తామని కలెక్టర్ తెలిపారు. రెవెన్యూ, మునిసిపల్, మండల, గ్రామ, వార్డు సచివాలయాలలో  స్పందన ఫిర్యాదులు అందచేయాలని కలెక్టర్ తెలియచేశారు.  మండల స్థాయి  అధికారులు అందరూ  మండల ప్రధాన కేంద్రంలో ఒకే చోట హాజరై ప్రజల నుంచి స్పందన అర్జీలు స్వీకరించాలన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

36 ఏళ్ల స్టీల్ ప్లాంట్ చరిత్రలో ఇలాంటి ఘటన జరగలేదు

-బాధిత కుటుంబాలకు అండగా ఉంటాం -మృతుల కుటుంబాలకు రూ. 25 లక్షల చొప్పున పరిహారం -కుటుంబంలో ఒకరికి ప్లాంట్ లో …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *