-రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి జోగి రమేష్
తాడిగడప (పెనమలూరు), నేటి పత్రిక ప్రజావార్త :
ప్రజా సంక్షేమం, పారదర్శకతతో కూడిన పాలన, పెనమలూరు నియోజకవర్గ అభివృద్ధే తన లక్ష్యమని రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి, పెనమలూరు నియోజకవర్గ సమన్వయకర్త జోగి రమేష్ అన్నారు. మంగళవారం పెనమలూరు నియోజకవర్గంలో ఆయన పలు సిసి రోడ్ల నిర్మాణానికి ఆయన శంకుస్థాపనలు చేశారు. ఉదయం తాడిగడప మున్సిపాలిటీ పరిధిలోని గుంటతిప్ప డ్రైన్ రోడ్డు నుండి విజయ దుర్గ ఆగ్రో ఇండస్ట్రీస్ వరకు 30 లక్షల రూపాయల వ్యయంతో నిర్మించనున్న సిసి రోడ్డు ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆ తర్వాత వైఎస్ఆర్ తాడిగడప మున్సిపాలిటీ పరిధిలోని సనత్ నగర్ నుంచి సిద్ధిక్ నగర్ వరకు 33 లక్షల రూపాయల వ్యయంతో నిర్మించనున్న సిసి రోడ్డు శంకుస్థాపన చేశారు. అనంతరం వైయస్సార్ తాడిగడప మున్సిపాలిటీ పరిధిలోని కారూరు దళితవాడ పరిధిలో 70 లక్షల రూపాయల వ్యయంతో నిర్మించనున్న సిసి రోడ్డుకు శంకుస్థాపన చేశారు .అలాగే, వైయస్సార్ తాడిగడప మున్సిపాలిటీ పరిధిలోని శ్రీరామ్ నగర్ కాలనీలో 23 లక్షల రూపాయల వ్యయంతో నిర్మించనున్న సిసి రోడ్డు నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు
అదేమాదిరిగా వైఎస్ఆర్ తాడిగడప మున్సిపాలిటీ పరిధిలోని ఉయ్యూరు సాంబశివరావు ఇంటి వద్ద నుంచి యనమలకుదురు డొంక రోడ్డు వరకు 39 లక్షల 50 వేల రూపాయల వ్యయంతో నిర్మించనున్న సిసి రోడ్డుకు శంకుస్థాపన చేశారు అలాగే వైయస్సార్ తాడిగడప మున్సిపాలిటీ పరిధిలోని శ్రీనివాస్ నగర్ కట్ట ప్రాంతంలో 88 లక్షల 57 వేల రూపాయలు జయంతో నిర్మించనున్న సిసి రోడ్లకు శంకుస్థాపన మంత్రి జోగి రమేష్ చేశారు.
వైయస్సార్ తాడిగడప మున్సిపాలిటీ పరిధిలోని బిజేఆర్ నగర్ నుండి పోరంకి – నిడమానూరు రోడ్డు వరకు 22 లక్షల 60 వేల రూపాయల వ్యయంతో నిర్మించనున్న సిసి రోడ్లకు శంకుస్థాపన చేశారు. ఆ తరువాత వైయస్సార్ తాడిగడప మున్సిపాలిటీ పరిధిలోని పోరంకి నిడమానూరు రోడ్డు నుండి రాజమాత నగర్ వరకు 36 లక్షల రూపాయల వ్యయంతో నిర్మించనున్న సిసి రోడ్లగు శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News