విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
కస్టమర్లు మా దేవుళ్ళు అని భావించే యూనియన్ బ్యాంక్ అఫ్ ఇండియా కస్టమర్లకు సేవలు అందించడంతోపాటు మానవత్వాన్ని చాటుకోవడంలో మేమున్నామని మరోసారి నిరూపించుకున్నారు యూనియన్ బ్యాంక్ అఫ్ ఇండియా రీజనల్ ఆఫీస్ విజయవాడ వారు. యూనియన్ బ్యాంక్ అఫ్ ఇండియా రీజనల్ ఆఫీస్ విజయవాడ వారి ఆధ్వర్యంలో జరుగుతున్న ‘పవర్ హిమ్ అండ్ ఎంపవర్ హర్’ అనే కార్యక్రమంలో భాగంగా మంగళవారం స్థానిక గోశాల గ్రామం నందు గల వాసవ్య మహిళా మండలిచే నిర్వహించబడే ఓల్డ్ ఏజ్ హోంకు రెండు లక్షల రూపాయల విలువైన హాస్పిటల్ బెడ్స్, రెఫ్రిజిరేటర్ మరియు ఇతర వంట పాత్రలు పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో యూనియన్ బ్యాంక్ జోనల్ ఆఫీస్ విజయవాడ జనరల్ మేనేజర్ రవీంద్రబాబు, డిప్యూటీ జోనల్ హెడ్ శారదామూర్తి, విజయవాడ రీజనల్ హెడ్ శ్రీధర్, వాసవ్యా మహిళా మండలి ప్రెసిడెంట్ డాక్టర్. బి.కీర్తి మరియు గోశాల గ్రామ సర్పంచ్ శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News