Breaking News

డేటా ఎంట్రీ ఆపరేటర్‌ పోస్టు అవుట్‌ సోర్సింగ్‌ భర్తీకి దరఖాస్తులు ఆహ్వనం

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
విభిన్న ప్రతిభావంతుల, హిజ్రాల మరియు వయోవృద్ధుల సంక్షేమ శాఖ సంచాలకులు వారి కార్యాలయంలో డేటా ఎంట్రీ ఆపరేటర్ పోస్టు అవుట్ సోర్సింగ్ ప్రాతిపదికన భర్తీ చేయుటకు దరఖాస్తులు కోరుచున్నామని ఆ శాఖ సంచాలకులు బి. రవి ప్రకాష్ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ పోస్టు బిసి(ఏ) కేటగిరీకి రిజర్వ్ చేయడం జరిగిందని, అభ్యర్థులు 42 సంవత్సరాల లోపు వయస్సు కలిగి ఉండాలన్నారు. దరఖాస్తు చేయగోరే అభ్యర్థులు గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుండి డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలని దానితో పాటుగా కంప్యూటర్ పరిజ్ఞానం, ఇంగ్లిష్ లో ప్రావీణ్యం కలిగి ఉండాలని చెప్పారు. ప్రభుత్వ నిబంధనలు మేరకు గరిష్ట వయోపరిమితిలో సడలింపు అనేది కల్పించడం జరుగుతుందని సంచాలకులు తెలిపారు. అర్హత కలిగిన వారు తమ బయో డేటా వివరాలు, విద్యార్హతలు, ప్రభుత్వ కార్యాలయంలో పనిచేసిన అనుభవ పత్రాలు మొదలుగునవి జతపరిచి ఈనెల 20వ తేదీలోగా దరఖాస్తులు సమర్పించాలని సంచాలకులు తెలిపారు. పూర్తి వివరాలతో అభ్యర్థులు తమ దరఖాస్తులను సంచాలకులు వారి కార్యాలయం, విభిన్న ప్రతిభావంతుల, హిజ్రాల మరియు వయోవృద్ధుల సంక్షేమ శాఖ, డో. నెం. 74-14-2, రాజనరేంద్ర బిల్డింగ్ మొదటి అంతస్తు, యనమలకుదురు రోడ్, కృష్ణ నగర్, విజయవాడ – 520007 చిరునామాకు మార్చి 20వ తేదీ లోగా సమర్పించాలని సంచాలకులు రవి ప్రకాష్ ఒక ప్రకటనలో తెలిపారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *