ద్వారకా తిరుమల, నేటి పత్రిక ప్రజావార్త :
మహిళలను ఆర్థికంగా బలోపేతం చేయాలనే ఉద్దేశ్యంతోనే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సంక్షేమ పథకాలన్నీ మహిళల పేరుతోనే అమలు చేస్తున్నారని రాష్ట్ర హోం మరియు విపత్తుల నిర్వహణ శాఖ మంత్రి డాక్టర్ తానేటి వనిత తెలిపారు. ద్వారకాతిరుమలలో మండల పరిధిలో నిర్వహించిన వైఎస్సార్ చేయూత 4వ విడత పంపిణీ కార్యక్రమంలో ఆమె ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మండలంలోని 42 0 2 మంది లబ్ధిదారులకు 7 కోట్ల 87లక్షల 87వేల 500 రూపాయల వైఎస్సార్ చేయూత చెక్కు నమూనాను హోంమంత్రి లబ్ధిదారులకు అందజేశారు. మండల పరిధి నుంచి వేలాదిగా మహిళలు తరలిరావడంతో ఆ సభ ప్రాంగణం కిక్కిరిసిపోయింది.
ఈ సందర్భంగా హోంమంత్రి తానేటి వనిత మాట్లాడుతూ.. 45 నుంచి 60 సంవత్సరాల్లోపు వయసున్న ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ అక్కచెల్లెమ్మలందరికీ వైఎస్సార్ చేయూత పథకం ద్వారా ఏడాదికి రూ.18,750లు చొప్పున నాలుగు విడతల్లో ఒక్కొక్కరికి రూ. 75వేలు చొప్పున అందచేసి ఆర్థిక భరోసా కల్పించిన సీఎం జగన్మోహన్ రెడ్డికి మహిళలంతా అండగా నిలబడాలని కోరారు. మీ బిడ్డల చదువులకు, మీ కుటుంబ అభివృద్ధికి దోహదపడుతుందనే ఉద్దేశ్యంతో కోట్లాది రూపాయిలు వెచ్చించి పేదింటి విద్యార్థుల కోసం అమ్మ ఒడి, గోరుముద్ద, విద్యాదీవెన. వసతి దీవెన వంటి పథకాలతో పేదల విద్యకు పెద్దపీట వేసి ప్రోత్సహించారన్నారు. ప్రతిపక్ష పార్టీలన్నీ కట్టుకట్టుకుని జగనన్నపై పోరాటానికి వస్తున్నాయని, పెత్తందార్లకు, పేదల పక్షాన నిలిచిన జగనన్న మధ్య జరిగే యుద్ధానికి అందరూ సిద్ధంగా ఉండాలని సూచించారు. మహిళలను ఆర్ధికంగా బలోపేతం చేసి వారి కుటుంబాలను అభివృద్ధి చేయాలనే లక్ష్యంతోనే అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి మహిళల బ్యాంకు ఖాతాల్లో నేరుగా నగదు బదిలీ చేశారన్నారు. జగనన్న ప్రభుత్వాన్ని మరల తెచ్చుకునేందుకు మహిళలంతా కృషిచేయాలని హోం మంత్రి పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, నాయకులు, అధికారులు, మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News