Breaking News

హోం ఓటింగు కోసం ప్రత్యేక దృష్టి పెట్టాలి

-నియోజక వర్గ పరిధిలో హోం ఓటింగు అర్హమైన ఓటర్లు 3,630
– రూరల్ ఆర్వో తేజ్ భరత్

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
రానున్న సార్వత్రిక ఎన్నికల లో ఓటింగు శాతం పెరిగేలా తీసుకునే చర్యలలో భాగంగా హోం ఓటింగు కోసం ప్రత్యేక కార్యచరణ సిద్దం చేసుకొని అమలు చెయ్యాలని రాజమండ్రీ రూరల్ నియోజక వర్గ రిటర్నింగ్ అధికారి, జాయింట్ కలెక్టర్ ఎన్. తేజ్ భరత్ స్పష్టం చేశారు. ఆదివారం జాయింట్ కలెక్టర్ ఛాంబర్ లో రిటర్నింగ్ అధికారి – 51-రాజమండ్రి రూరల్ సెక్టార్ అధికారులు, బూత్ స్థాయి అధికారులతో, సూపర్‌వైజర్లు తో ఇంటి ఓటింగ్‌పై సమావేశం నిర్వహించారు

ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ రూరల్ తేజ్ భరత్ మాట్లాడుతూ, ఎన్నికలలో ఓటింగు శాతం పెరిగేలా ఎన్నికల కమీషన్ తీసుకున్న చర్యల లో భాగంగా 85 ఏళ్లు నిండిన ఓటర్లు, 40 శాతం పైబడిన దివ్యాంగా ఓటర్ల ఐచ్చికం మేరకు 12 డి ఫారం ద్వారా అంగీకారం తెలిపిన వారికి ఇంటి వద్దనే ఓటు హక్కును వినియోగించుకునే అవకాశం కల్పించనున్నట్లు తెలిపారు. అందులో భాగంగానే నియోజక వర్గ పరిధిలోని 267 పోలింగ్ కేంద్రాలలో 85 ఏళ్లు నిండిన 1191 ఓటర్లు, 40 శాతం పైబడిన దివ్యాంగ ఓటర్లు 2439 ఉన్నట్లు గుర్తించడం జరిగిందన్నారు. పోలింగు కేంద్రానికి వొచ్చి ఓటు హక్కును వినియోగించుకునే అవకాశం ఉందని తెలిపారు. పోలింగు కేంద్రానికి రాలేని వారికీ వారీ నుంచీ ఆమేరకు 12 డి ఫారం ద్వారా అంగీకారం పత్రం తీసుకుని ఆమేరకు ఓటు హక్కును వినియోగించుకునే అవకాశం కల్పించాల్సి ఉంటుందన్నారు. ఈ ప్రక్రియలో సెక్టార్ అధికారులు, సూపర్ వైజెర్స్, బీ ఎల్ వో లు ఎంతో జాగ్రత్తగా వ్యవహరించాలని సూచించారు.

ఈ సమావేశంలో సహాయ రిటర్నింగ్ అధికారి, డిప్యూటీ కలెక్టర్ ఐ. సాయిబాబు, సహాయ రిటర్నింగ్ అధికార్లు మరియు తహశీల్దార్లు  వై. కె. వి. అప్పారావు , బి. రమాదేవి, సెక్టార్ అధికారులు, సూపర్ వైజర్ లు, బి ఎల్ వో లు,, ఇతర అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

36 ఏళ్ల స్టీల్ ప్లాంట్ చరిత్రలో ఇలాంటి ఘటన జరగలేదు

-బాధిత కుటుంబాలకు అండగా ఉంటాం -మృతుల కుటుంబాలకు రూ. 25 లక్షల చొప్పున పరిహారం -కుటుంబంలో ఒకరికి ప్లాంట్ లో …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *