-పొట్టిలంక చెక్ పోస్ట్ వద్ద స్వాగతం పలికిన కలెక్టర్, ఎస్పి
కడియం, నేటి పత్రిక ప్రజావార్త :
సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో తూర్పు గోదావరి జిల్లాలో ఎన్నికల నిర్వహణ తీరును పరిశీలించేందుకు బుధవారం రాత్రి స్పెషల్ జనరల్ అబ్జర్వర్ రామ్ మోహన్ మిశ్రా రాజమహేంద్రవరం చేరుకున్నారు. జిల్లాలో పరిశీలన నిమిత్తం విచ్చేసిన స్పెషల్ జనరల్ అబ్జర్వర్ రామ్ మోహన్ మిశ్రా కు పొట్టి లంక చెక్ పోస్ట్ వద్ద కలెక్టర్ జిల్లా ఎన్నికల అధికారి డా కే. మాధవీలత, జిల్లా సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ పి. జగదీష్ లు మర్యాద పూర్వకంగా కలిసి, పుష్పగుచ్చం అందచేశారు. ఈ సందర్బంగా పశ్చిమ గోదావరీ జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ హాజరై వీడ్కోలు పలికారు.
Prajavartha Online Telugu News