విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
అనతి కాలంలో జరగబోయే శాసనసభ, పార్లమెంట్ ఎన్నికల్లో వైసిపి ఘోరంగా ఓడిపోబోతుందని, ప్రజల్లో ప్రభుత్వంపై వ్యతిరేకత పెరుగుతున్న కొద్దీ అధికార పార్టీ కుట్రలను మరింత పెంచుతోందని, దీన్ని తెలుగుదేశం పార్టీ తీవ్రంగా ఖండిస్తోందని ఎపి స్టేట్ మాజీ సర్వీస్మెన్ వెల్ఫేర్ అసోసియేషన్, వ్యవస్థాపకులు, అధ్యక్షులు మోటూరి శంకరరావు అన్నారు. మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యాలయంలో బుధవారం నిర్వహించిన విలేఖరుల సమావేశంలో ఎపి స్టేట్ మాజీ సర్వీస్మెన్ వెల్ఫేర్ అసోసియేషన్, వ్యవస్థాపకులు, అధ్యక్షులు మోటూరి శంకరరావు మాట్లాడుతూ ముందుగా ప్రజలందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలిపారు. రాబోయేది రామరాజ్యమని, ప్రజావాక్కును శిరసావహించే రామరాజ్యాన్ని మనం చూడాలంటే తెలుగుదేశం పార్టీ వల్లే సాధ్యమవుతుందన్నారు. ఎన్డీఎ కూటమి తెలుగుదేశం, జనసేన, బీజేపీ అభ్యర్దుల విజయానికి కృషి చేసి తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబునాయుడుని తిరిగి ముఖ్యమంత్రి కావడానికి అందరం కృషి చేస్తామన్నారు. ఆంధ్రప్రదేశ్లో పేదరికం లేని సమాజం చూడాలని, రాష్ట్రంలో ప్రజల కోసం కఠోర శ్రమ చేస్తున్న నిరంతర పోరాట యోధుడు నారా చంద్రబాబునాయుడును రాబోయే ఎన్నికలలో తిరిగి రాష్ట్రంలో ముఖ్యమంత్రిని చేసి రామరాజ్య స్థాపనకు రాజకీయాలకు అతీతంగా ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఒక్క ఛాన్స్… ఒక్క ఛాన్స్ అని చెప్పి వచ్చిన జగన్ రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టారన్నారు. ఎన్ని కుయుక్తులు పన్నినా వచ్చేది జనసేన- తెలుగుదేశం- బీజేపీ ప్రభుత్వమేనన్నారు. ఇప్పటికే అన్ని సర్వేలు టీడీపీ కూటమి విజయం తథ్యమని తెలియజేస్తున్నాయన్నారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News