రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
గురువారం రాజమహేంద్రవరం బార్ అసోసియేషన్ నందు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి కె. ప్రకాష్ బాబు న్యాయవాదులు, జిల్లా రవాణా శాఖ అధికారులు, పోలీసు అధికారులు తో “రోడ్డు ప్రమాదాల నివారణ” పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి కె. ప్రకాష్ బాబు మాట్లాడుతూ ప్రతీ ఒక్కరూ ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని అన్నారు. అతి వేగం ప్రమాదకరమని తెలిపారు. నిబంధనలు ఉల్లంఘించి ఎవరు వాహనాలు నడపరాదుని హెల్మెట్, సీట్ బెల్ట్ ధరించకుండా వాహనాలు నడపడం ప్రమాదకరమని అన్నారు. ఈ సదస్సులో మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ జి.రామ్ నారాయణ్, అస్సిస్టంట్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ జి. రాధికా దేవి, బార్ అసోసియేషన్ అధ్యక్షలు టి. వీరేంద్రనాథ్ , న్యాయవాదులు, తదితరులు పాల్గొన్నారు. అనంతరం స్థానిక బొమ్మూరు లో మహిళా ప్రాంగణం వద్ద నల్సా వారి “అక్రమ రవాణా బాధితులు మరియు వాణిజ్య పరమైన లైంగిక దోపిడీ బాధితుల పథకం, 2015″ మరియు నల్సా వారి ” బాధితులు నష్ట పరిహార పథకం, 2015″ గురించి వివరించారు. ఈ కార్యక్రమం లో ఐ.సి.డి.ఎస్ పి.డి కె. విజయ కుమారి , సి.డి.పి.ఒ ఐ.సి.డి.ఎస్ రాజానగరం నాగమణి , ప్రజ్వల ఎన్.జి. ఒ, ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News