Breaking News

ఓపెన్ స‌్కూల్ ద‌్వారా చదువు మళ‌్ళీ కొనసాగిద‌్దాం… బంగారు భవితకు బాటలు వేద‌్దాం

-సామాజిక సేవతో కూడినది సార‌్వత‌్రిక విద‌్య
-నియత విద‌్యకు సార‌్వత‌్రిక విద‌్య సమాంతరం
-డిజీ లాకర్ లో ఓపెన్ స‌్కూల్ దృవీకరణ పత‌్రాలు

తిరుచానూరు, నేటి పత్రిక ప్రజావార్త :
మానివేసిన చదువు మళ‌్ళీ కొనసాగిద‌్దాం… బంగారు భవితకు బాటలు వేద‌్దాం అన‌్న నినాదంతో ఆంధ్ర ప్రదేశ్ ఓపెన్ స‌్కూల్ ను ప‌్రభుత‌్వం సర‌్వజనులకు అందుబాటులోకి తీసుకువచ్చిందని తిరుపతి జిల్లా ప‌్రభుత‌్వ పరీక్షలు సహాయ సంచాలకులు, ఓపెన్ స్కూల్ జిల్లా కో ఆర్డినేటర్ గురుస‌్వామి రెడ్డి అన‌్నారు. తిరుపతి జిల్లాలోని ఓపెన్ స‌్కూల్ అధ‌్యయన కేంద్రాల సమన‌్వయ కర‌్తలకు తిరుచానూరులోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో శనివారం అడ‌్మిషన్ ప‌్రక‌్రియకు సంబందించి ఒక రోజు ఓరియంటేషన్ కార‌్యక‌్రమం నిర్వహించారు. ముందుగా పరిచయ కార్యక్రమం నిర్వహించారు.
కరపత‌్రాలను ఆవిష‌్కరించారు.
అనంతరం ఆయన మాట్లాడుతూ ఓపెన్ స‌్కూల్ నందు 10 వ తరగతి 2008-09 విద‌్యా సంవత్సరం నుంచి ప‌్రవేశపెట‌్టినట‌్టు చెప్పారు. ప‌్రవేశాలు పూర్తిగా ఆన్ లైన్ ప‌్రక‌్రియతో కూడినది గా తెలిపారు. ప‌్రవేశ సమయంలో ఆన్ లైన్ నందు చాలా జాగ్రత్తగా వివరాలను పొందుపరచాలని సూచించారు. ఓపెన్ స‌్కూల్ వ‌్యవస‌్థ నందు 5 సబ్ జెక‌్టులు మాత‌్రమే వుంటాయని, 6 సబ్జెక్టును ఆప్షనల్ గా ఎంచుకోవచ్చని, విద‌్యార‌్థులు తమకు నచ‌్చిన మాధ‌్యమంలో పరీక్ష రాయవచ‌్చునని వివరించారు. పదవ తరగతిలో ప‌్రవేశం పొందగోరు వారి తల‌్లిదండ‌్రుల పేర‌్లు, పుట్టిన తేదీ, ఆధార్ కార్డు వంటి వివరాలు తప‌్పక నమోదు చేయాలని సూచించారు. భవిష‌్యత‌్తులో సమస‌్యలు తలెత‌్తకుండా చూడాల‌్సిన బాధ‌్యత అధ‌్యయన కేంద్రాల సమన‌్వయ కర‌్తలపైన వుందన‌్నారు. టిఓసి విధానాన్ని గురించి వివరించారు.ప‌్రత‌్యేక ప‌్రతిభావంతుల ప‌్రవేశాలు చేసే విధానం గురించి పేర‌్కొన‌్నారు. ఇంటర‌్మీడియట్ విద‌్యను 2010-11 విద‌్యా సంవత్సరం నుంచి ఓపెన్ స్కూల్ విధానంలో ప‌్రవేశ పెట‌్టబడిందని,ఇందులోని గ‌్రూపులను గురించి కూలంకషంగా చర్చించారు. ఇందులో వెసులుబాటు అవకాశాలను వివరించారు.ప‌్రవేశ సమయంలో విద‌్యార‌్థి ఫోటో మరియు సంతకాన‌్ని అప్ లోడ్ చేయాలని కోరారు. ప‌్రవేశాల ప‌్రక‌్రియ పూర్తి అయిన అనంతరం 30 పిసిపి తరగతులు నిర్వహించాలని,3 ట‌్యూటర్ మార‌్‌్కడ్ అసైన్మెంట్ లు, 2 ప‌్రిపరేటరీ పరీక్షలు రాయించాలని తెలియజేశారు. విద‌్యార‌్థులకు ఉచితంగా పుస‌్తకాలు అందజేస‌్తున‌్నట‌్టు చెప్పారు. ఇది పూర్తిగా సామాజిక సేవా కార్యక్రమంగా ఆయన అభిప్రాయపడ్డారు.సార‌్వత‌్రిక విద‌్య రెగ‌్యులర్ విద‌్యతో సమానమైనదిగా పేర్కొన్నారు.ఇందులో వృత్తి విద్యా కోర్సులు అందుబాటులో ఉన్నాయని చెప్పారు. ఇకనుంచి ధృవీకరణ పత‌్రాలు డిజీ లాకర్ లో రాబోతున్నట్టు, ఈ జ్ఞాన ధార యూట‌్యూబ్ చానల్ ద‌్వారా పాఠ్యాంశాలు వీక్షించే అవకాశం కల్పించినట్లు తెలియజేశారు. అనంతరం ఓపెన్ స్కూల్ ప్రాముఖ్యతని వివరిస్తూ ఊరేగింపు నిర్వహించారు.ఈ శిక్షణా కార్యక్రమంలో తిరుపతి జిల్లా విద్యాశాఖ అధికారి శేఖర్, తిరుపతి అర్బన్ మండల విద్యాశాఖాధికారి భాస్కర్ నాయక్, తిరుపతి రూరల్ విద్యాశాఖాధికారి బి దేవరాజులు, కె శంకరయ్య, తిరుపతి జిల్లాలో అధ‌్యయన కేంద్రాల సమన‌్వయ కర‌్తలు, డీఈవో కార్యాలయ సిబ్బంది ప‌్రశాంత్ తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ముస్లిం మైనారిటీల సంక్షేమానికి కృషి

-ఎమ్మెల్యే సుజనా చౌదరి విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ముస్లిం,మైనార్టీల సంక్షేమం, అభివృద్ధి కోసం కూటమి ప్రభుత్వం చిత్తశుద్ధితో …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *