తిరుమల, నేటి పత్రిక ప్రజావార్త :
తిరుమల తిరుపతి రెండు రోజులు పర్యటనలో భాగంగా శనివారం రాత్రి తిరుమల చేరుకున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సమాచార పౌర సంబంధాలు మరియు గృహ నిర్మాణ శాఖ మంత్రి వర్యులు కొలుసు పార్థసారథి కి టీటీడీ ఓఎస్డి సత్రా నాయక్, జిల్లా సమాచార పౌర సంబంధాల శాఖ అధికారి బాల కొండయ్య, జిల్లా గృహ నిర్మాణ శాఖ అధికారి వెంకటేశ్వర రావు, డిఈ శ్రీనివాసరావు, ఎఈ లు మహేష్, శ్రీరామ్ రెడ్డి, ప్రోటోకాల్ కృష్ణయ్య తదితరులు పుష్ప గుచ్చాలు అందజేసి స్వాగతం పలికారు. మంత్రి ఆదివారం ఉదయం విఐపి విరామ సమయంలో తిరుమల శ్రీవారిని దర్శించుకోనున్నారు.
Prajavartha Online Telugu News