విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ఎమ్మెల్యే సుజనా చౌదరి ఆదేశాల మేరకు 44 వ డివిజన్ చెరువు సెంటర్ లోని చౌక దుకాణాలను శనివారం ఎమ్మెల్యే కార్యాలయ కార్యదర్శి ప్రత్తిపాటి శ్రీధర్ తనిఖీ చేశారు. రేషన్ షాపుల పనితీరు నిత్యవసర సరుకుల నాణ్యతను పరిశీలించి రేషన్ డీలర్ కోట గురునాధరావు తో ముఖాముఖి చర్చించారు. క్షేత్రస్థాయిలో చౌక దుకాణాల పనితీరుపై ప్రత్యేక పరిశీలన చేస్తున్నామన్నారు. పశ్చిమ లోని 120 చౌక డిపోల ద్వారా పదివేల మంది లబ్ధి పొందుతున్నారని అర్హులైన ప్రతి ఒక్కరికి త్వరలోనే కొత్త రేషన్ కార్డులు అందించేలా కూటమి ప్రభుత్వం అన్ని రకాల చర్యలు తీసుకుంటుందన్నారు. ప్రస్తుతానికి బియ్యం, పంచదార, సరఫరా జరుగుతుందని త్వరలోనే అన్ని రకాల సరుకులు ఇచ్చేలా ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారన్నారు. రైతు బజార్లలో మార్కెట్ ధరలకంటే తక్కువకె బియ్యం, కందిపప్పు, అందిస్తున్నామని ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. ఎమ్మెల్యే సుజనా చౌదరి ఆదేశాల మేరకు పశ్చిమలోని అన్ని చౌక దుకాణాలలో తనిఖీలను నిర్వహిస్తున్నామన్నారు. కార్యక్రమంలో టిడిపి డివిజన్ ప్రెసిడెంట్ బొడ్డుపల్లి శ్రీనివాసరావు బిజెపి మండల అధ్యక్షులు పచ్చిపులుసు శివ ప్రసాద్ పాల్గొన్నారు.
Tags vijayawada
Check Also
ఆరోగ్యం, విద్య, ఆవిష్కరణలకే మా ప్రాధాన్యత
-సహకరించాలని బీఎంజీఎఫ్‌కు వినతి -బిల్‌గేట్స్‌తో ముఖ్యమంత్రి చంద్రబాబు భేటీ దావోస్, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్‌ను ఆరోగ్య, విద్య, ఆవిష్కరణల …