-విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
నగరపాలక సంస్థ ప్రజారోగ్య పారిశుద్ధ్య నిర్వహణకు భంగం కలగకుండా, ప్రజలకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఉండేందుకు గురువారం ఉదయం విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యాన చంద్ర తమ చాంబర్లో వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్ డాక్టర్ బి సోమశేఖర్ రెడ్డి, పందుల పెంపకం యజమానులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ విజయవాడ నగరపాలక సంస్థ పరిధిలో పందులు సంచరించకుండా, పందుల యజమానులు, తమ పందులను రోడ్లపై సంచరించకుండా చూసుకోవాల్సిందిగా, పందుల యజమానులకు పాతపాడు గ్రామమునందు కేటాయించి ఉన్న స్థలములో నందు మాత్రమే పందులను ఉంచవలసిందిగా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఈ సందర్భంగా పందుల యజమానులు కమిషనర్ గారికి కొన్ని వినతులు సమర్పించగా, వారు అడిగిన సౌకర్యాలను ఇతర శాఖలతో సమన్వయంతో కల్పించమని వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్ డాక్టర్ బి.సోమశేఖర్ రెడ్డిని ఆదేశించారు.