-జిల్లా కలెక్టర్ డా.ఎస్ వెంకటేశ్వర్
తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త :
ఆజాదీ కా అమృత్ మహోత్సవంలో భాగంగా కేంద్ర ప్రభుత్వం నిర్దేశించిన హర్ ఘర్ తిరంగా కార్యక్రమాన్ని జిల్లా లో ఈనెల ఆగస్ట్ 12 నుండి 15 వరకు ఘనంగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ డా ఎస్. వెంకటేశ్వర్ పేర్కొన్నారు. రేపు(నేడు)12వ తేదీ జిల్లా,మండల, గ్రామ,వార్డు పరిధిలో హర్ ఘర్ తిరంగా ర్యాలీ నిర్వహణను అర్బన్ పరిధిలో మున్సిపల్ కమిషనర్లు, మండలాల్లో ఎంపిడిఓ లు, గ్రామ పంచాయతీ పరిధిలో డిపిఓ, స్పోర్ట్స్, ఎన్ వైకే, విద్యా శాఖ పర్యవేక్షించాలని, జిల్లా విద్యా శాఖ వారి ఆధ్వర్యంలో దేశభక్తి గీతాల నిర్వహణ పేడిట్రియాటిక్ డ్రామా/ మోనో యాక్షన్ ప్రదర్శన తదితర కార్యక్రమాలు చేపట్టాలని, డి.ఆర్.డి ఏ, మెప్మా వారు ఎస్‌హెచ్‌జి భాగస్వామ్యంతో జెండాల విక్రయాలతో స్టాల్స్‌ను నిర్వహించాలి. 13 వ తేదిన బిగ్ రన్ మారథాన్ ను డి ఎస్ డి ఓ, డీఈవో, సమన్వయం తో నిర్వహించాలని, అన్ని ప్రభుత్వ శాఖల కార్యాలయాలలో జాతీయ జెండాను ఎగర వేయాలని, 14 వ తేదిన జాతీయ జెండాలతో https://harghartiranga.com link ద్వారా సెల్ఫీ తీసుకొని పోస్ట్ చేయడం, మున్సిపల్ కమిషనర్ మరియు పంచాయతీ రాజ్ వారి ఆద్వర్యంలో స్వాతంత్ర్య సమరయోధులు,వారి కుటుంబీకులను గౌరవించాలని, ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్లు పంచాయితీ రాజ్ వారు సమన్వయంతో పని చేయాలన్నారు. ఆగస్టు 15 న జాతీయ జెండాను జిల్లాలోని అన్ని ప్రభుత్వ శాఖల కార్యాలయంలో ఎగుర వేయాలని ఆదేశించారు. హర్ ఘర్ తిరంగా కార్యక్రమాన్ని గ్రామ,మండల, జిల్లా స్థాయిలో విజయవంతం చేయడంలో అన్ని శాఖలు సమన్వయంతో పాల్గొని విజయవంతం చేయాలని కలెక్టర్ ఆ ప్రకటన లో తెలిపారు.