విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయ స్థాయి ఆర్టిస్టిక్ పోటీల్లో ఎన్నో పతకాలను సాధించిన ఉమ్మడి కృష్ణా జిల్లాకు చెందిన చైత్రదీపిక ను విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ అభినందించారు. చైత్ర ఇటీవల పొల్లాచి (కోయంబత్తూరు) లో జరిగిన 2nd ఇండియా స్కేట్ గేమ్స్ -2024 ఆర్టిస్టిక్ స్కేటింగ్ లో మూడు పతకాలు సాధించింది. 2nd ఇండియా స్కేట్ గేమ్స్ -2024 లో సోలో డాన్స్ లో రజత పతకం, ఫ్రీ స్కేటింగ్ లో రజతం, క్వార్టెట్ లో కాంస్యం గెలుపొందింది. చైత్ర ఆదివారం ఎన్టీఆర్ భవన్ లో ఎంపి కేశినేని శివనాథ్ ను మర్యాద పూర్వకంగా కలిసింది. ఈ సందర్భంగా చైత్ర తను సాధించిన పతకాలు, సర్టిఫికేట్స్ ను చూపించటం జరిగింది. రాబోయే రోజుల్లో చైత్ర అంతర్జాతీయ పతకాలు సాధించి విజయవాడ క్రీడా ఖ్యాతిని ప్రపంచానికి చాటాలని ఎంపీ కేశినేని శివనాథ్ ఆకాంక్షించారు. అలాగే చైత్ర అభిరుచి తెలుసుకుని ఆ రంగంలో ప్రొత్సహించినందుకు తల్లిదండ్రులు పి.సతీష్, లలితాదేవి, శిక్షణ ఇచ్చిన కోచ్ పి.స త్యనారాయణ లను అభినందించారు.
చైత్ర 59th,60th,61st రోలరు స్కేటింగ్ నేషనల్ ఛాంపియన్షిప్, గతేడాది బిజినింగ్ చైనా లో జరిగిన 19th ఆసియన్ రోలరు స్కేటింగ్ ఛాంపియన్ షిప్ లో పసిడి పతకాలు సాధించింది. ఎన్ఎస్ఎం స్కూల్లో 9వ తర గతి చదువుతున్న చైత్రదీపిక ఇప్పటి వరకు రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయ స్థాయి పోటీల్లో 42 పతకాలను కైవసం చేసుకుంది.