విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చలనచిత్ర పరిశ్రమ స్థిరపడి అభివృద్ధి చెందడానికి కృషి చేస్తానని కంచర్ల అచ్యుతరావు తెలిపారు. శుక్రవారం గాంధీనగర్‌లో ఓ ప్రైవేట్ హోటల్‌లో జరిగిన కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ ఫిల్మ్ ఇండస్ట్రీ ఎంప్లాయిస్ ఫెడరేషన్‌కు నూతన చైర్మన్‌గా ఏకగ్రీవంగా కంచర్ల అచ్యుతరావు ఎన్నికయ్యారు. ఆంధ్రప్రదేశ్ ఫిల్మ్ ఇండస్ట్రీ ఎంప్లాయిస్ ఫెడరేషన్ హెచ్-228 చైర్మన్‌గా ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చలనచిత్ర పరిశ్రమ స్థిరపడి అభివృద్ధి చెందాలని అప్పుడే చలనచిత్ర కార్మికులుకు మేలు కలుగుతుందని, దానికోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కృషి చేయాలని త్వరలో ఆ దిశగా రాబోయే రోజుల్లో ఆంధ్రప్రదేశ్ ఫిల్మ్ ఇండస్ట్రీ ఎంప్లాయిస్ ఫెడరేషన్ అధ్యక్షులు తోరం రాజా ఆధ్వర్యంలో కృషి చేయడం జరుగుతుందని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ ఫిల్మ్ ఇండస్ట్రీ ఎంప్లాయిస్ ఫెడరేషన్ అధ్యక్షులు తోరం రాజా మాట్లాడుతూ.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చలనచిత్ర పరిశ్రమ అభివృద్ధి చేందడానికి, 24 క్రాఫ్ట్స్ సభ్యులు సంక్షేమం అభివృద్ధి దృష్టిలో పెట్టుకొని కంచర్ల అచ్యుతరావుని చైర్మన్‌గా ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగిందని తెలిపారు. ఉపాధ్యక్షులు కొండపల్లి అప్పారావు మాట్లాడుతూ… ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 24 క్రాఫ్ట్స్ యూనియన్స్‌లో పనిచేస్తున్న కార్మికులు అందరికీ మేలు చేయడం కొరకు కంచర్ల అచ్యుతరావుని చైర్మన్‌ని ఎన్నుకోవడం జరిగిందని తెలిపారు. ప్రధాన కార్యదర్శి చవల మురళీకృష్ణ మాట్లాడుతూ… ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చలనచిత్ర పరిశ్రమ స్థిరపడి అభివృద్ధి చేందడానికి గత 4 సంవత్సరాల కాలంగా కృషి జరుగుతోందని, త్వరలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సినీ నిర్మాణం చేయడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ముత్తుకూరు నరసింహులు, వీరికి నరసింహారావు, పోలుదాసు రంగనాయకులు, పూల శ్రీను, ముళ్లపూడి రాధ, చెన్నుపల్లి పుష్ప, యర్రంశెట్టి దుర్గా భవాని, ముద్దన సుభాషిణి తదితరులు పాల్గొన్నారు.
Tags vijayawada
Check Also
ముస్లిం మైనారిటీల సంక్షేమానికి కృషి
-ఎమ్మెల్యే సుజనా చౌదరి విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ముస్లిం,మైనార్టీల సంక్షేమం, అభివృద్ధి కోసం కూటమి ప్రభుత్వం చిత్తశుద్ధితో …