విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
వాసవ్య మహిళా మండలి మరియు ఆదిత్య బిల్లా ఎడ్యుకేషన్ ట్రస్టు ఆధ్వర్యంలో శనివారం సి.వి.సి సిద్ధ్యార్థ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజి కళాశాలలో మానసిక ఆరోగ్యంపై అవగాహనా కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా కె. విజయ, ఉపాదక్ష్యులు, వానన్య మహిళా మండలి మాట్లాడుతూ ప్రతిఒక్కరూ మానసిక ఒత్తిడిని జయించాలని కావున దీనిపై అవగాహనను కలిగి ఉండాలని ఆమె అన్నారు. మానవుని దైనందిన జీవితంలో రోజు ఏదోఒక సందర్భంలో ఒత్తిడికి, ఆవేదన, నిరాశ, ఆందోలన, కోపం, చికాకు కు గురి అవుతుండవచ్చు అని వీటినుండి కొన్ని సార్లు వారం, పదిరోజులలో విముక్తి రావొచ్చు కాని కొన్నిపారు మరింత ఎక్కువ సమయం పడుతున్నట్లు తెలుసుకుంటే తక్షణమే వైద్యులను సంప్రదించాలని ఆమె అన్నారు. ముఖ్యంగా యువత మానసికంగా ఆరోగ్యం గా ఉండాలని చిన్న చిన్న సమస్యలకు ఆత్మహత్యలు చేసుకోవడం, మాదక ద్రవ్యాలు, మద్యపానం వినియోగం పై దృష్టి సాదించడం దురదుష్టకరమని వీరిని ఆ సమస్యలో నుండి బయట పడిలా కుటుంబీకులు, స్నేహితుల సహకారం తప్పక ఉండాలని కొన్నిసార్లు డాక్టర్ల సూచన మేరకు చికిత్సను తీసుకోవాలని ఆమె అన్నారు. ఈ కార్యక్రమంలో కళాశాల అధ్యాపకులు, వాసవ్య సిబ్బంది పాల్గొన్నరు.
Tags vijayawada
Check Also
ఆరోగ్యం, విద్య, ఆవిష్కరణలకే మా ప్రాధాన్యత
-సహకరించాలని బీఎంజీఎఫ్‌కు వినతి -బిల్‌గేట్స్‌తో ముఖ్యమంత్రి చంద్రబాబు భేటీ దావోస్, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్‌ను ఆరోగ్య, విద్య, ఆవిష్కరణల …