-ఎమ్మెల్యే సుజనా చౌదరి
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
పర్యాటక ప్రదేశమైన భవాని ద్విపాన్ని అభివృద్ధి చేయడమే లక్ష్యంగా కృషి చేస్తానని పశ్చిమ ఎమ్మెల్యే యలమంచిలి సత్యనారాయణ (సుజనా చౌదరి) అన్నారు. ఆదివారం ఎన్డీయే కూటమి నాయకులతో కలిసి భవాని పురంలోని భవాని ద్వీపాన్ని(ఐలాండ్) సందర్శించారు. భవానీ ద్వీపాన్ని క్షేత్రస్థాయిలో పరిశీలించి ఏపీ టూరిజం అధికారులు, సిబ్బందితో భవానీ ద్వీప సమస్యల గురించి ఆరా తీశారు. అక్కడికి వచ్చిన పర్యాటకులతో ముచ్చటించి సలహాలు సూచనలను తీసుకున్నారు. భవాని ద్వీపాన్ని అభివృద్ధి చేయడానికి ప్రణాళికలు రూపొందించాలని ఏపీ టూరిజం డివిజనల్ మేనేజర్ పి ఎన్ కె కృష్ణచైతన్య ను ఎమ్మెల్యే సుజనా కోరారు. అనేక అవకాశాలు వనరులు ఉన్నప్పటికీ గత వైసిపి ప్రభుత్వం పర్యాటక ప్రాంతమైన భవాని ద్వీప అభివృద్ధిని విస్మరించిందని అన్నారు. ఇంద్రకీలాద్రిని ఆధ్యాత్మిక క్షేత్రంగా మార్చడంతో పాటు భవానీ ద్వీపాన్ని అభివృద్ధి చేసి పర్యాటక రంగాన్ని ప్రోత్సహిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో ఎపి టూరిజం అసోసియేషన్ ప్రెసిడెంట్ డాక్టర్ తరుణ్ కాకాని, బెర్మ్ పార్క్ యూనిట్ మేనేజర్ శ్రీనివాసరావు, సుధీర్, రవీంద్ర, నాయకులు బొమ్మసాని సుబ్బారావు.అడ్డూరి శ్రీరామ్, ఎమ్మెస్ బెగ్, పైలా సోమీ నాయుడు తదితరులు పాల్గొన్నారు