గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త :
వరద బాధితుల కోసం రూ.5 వేలు విరాళం అందించిన నగరపాలక సంస్థ రెవెన్యూ అధికారి రెహ్మాన్ కి గుంటూరు నగరపాలక సంస్థ తరుపున ప్రత్యేక అభినందనలు తెలుపుతున్నామని నగర కమిషనర్ పులి శ్రీనివాసులు ఐఏఎస్ గారు తెలిపారు. వరద ప్రభావిత ప్రాంతాల ప్రజలకు అండగా నిలవడానికి గుంటూరు నగరపాలక సంస్థ విరాళాలు, వస్తువుల సేకరణకు ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన సెల్ లో రెహ్మాన్ ముందుగా విరాళం అందించి పలువురికి ఆదర్శంగా నిలిచారన్నారు. రెహ్మాన్ అందించిన నగదుని సిఎం రిలీఫ్ ఫండ్ కి జమ చేయడం జరిగిందన్నారు.
Tags guntur
Check Also
వరద బాధితులకు విరాళాల వెల్లువ
-సీఎం చంద్రబాబును కలిసి చెక్కులు అందించిన దాతలు అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : అనూహ్య వరదలతో నిర్వాసితులైన బాధితులకు …