-ఎమ్మెల్యే సుజనా చౌదరి
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ఇటీవల సంభవించిన భారీ వర్షాల కారణంగా దెబ్బతిన్న ప్రకాశం బ్యారేజీ మరమ్మతు పనులను గురువారం బిజెపి రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి ,పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే యలమంచిలి సత్యనారాయణ (సుజనా చౌదరి) గురువారం పరిశీలించారు. కాంగ్రెస్ హయాంలో 2005 వ సంవత్సరం లో వరద వచ్చినప్పుడు ఖానాల వద్ద పిల్లర్లు కొంతవరకు దెబ్బతిన్న విషయాన్ని గుర్తించి ఇరిగేషన్ అధికారులు మరమ్మతులు చేశారు. ఇటీవల సంభవించిన భారీ వర్షాల వలన గతంలో ఎప్పుడూ రాని విధంగా కృష్ణా నదికి 11 లక్షల క్యూసెక్కుల పైన వరద పారింది. వరదల దాటికి పడవలు ఢీకొని దెబ్బతిన్న గడ్డర్లను ఇరిగేషన్ శాఖ యుద్ధ ప్రాతిపదికన మరమ్మతులు నిర్వహించారు. పుకార్లను నమ్మవద్దని ప్రకాశం బ్యారేజీ పటిష్టతపై ఎటువంటి అనుమానాలకు తావు లేదని పశ్చిమ ఎమ్మెల్యే సుజనా చౌదరి స్పష్టం చేశారు. బిజెపి స్టేట్ మీడియా సెల్ కన్వీనర్ పాతూరి నాగభూషణం ఎన్డీయే కూటమి నాయకులు పాల్గొన్నారు .
Prajavartha Online Telugu News