తిరుమల, నేటి పత్రిక ప్రజావార్త :
ఆదివరాహక్షేత్రమైన తిరుమలలోని శ్రీ భూ వరాహస్వామివారి ఆలయంలో గురువారం ఉదయం వరాహ జయంతి శాస్త్రోక్తంగా జరిగింది. ఇందులో భాగంగా ఉదయం కలశస్థాపన, కలశ పూజ, పుణ్యాహవచనం చేపట్టారు. అనంతరం వేదమంత్రాల నడుమ మూలవర్లకు పాలు, పెరుగు, తేనె, కొబ్బరినీళ్లు, పసుపు, చందనంతో విశేషంగా అభిషేకం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అదనపు ఈవో శ్రీ సిహెచ్ వెంకయ్య చౌదరి, ఆలయ అర్చకులు, ఇతర అధికారులు పాల్గొన్నారు.
Tags tirumala
Check Also
4.06 లక్షల బాదితులకు వరద నష్టపరిహారంగా రూ.601 కోట్లు చెల్లింపు
-రాష్ట్ర రెవెన్యూ, రిజిస్ట్రేషన్ మరియు స్టాంప్స్ శాఖామాత్యులు అనగాని సత్యప్రసాద్ అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలో ఈ …