Breaking News

28 ఇసుక నిల్వ కేంద్రాలలో అందుబాటులో ఉన్న నిల్వలు 14,48,302 మెట్రిక్ టన్నులు

-రాష్ట్ర గనులు, అబ్కారీ శాఖ ముఖ్య కార్యదర్శి ముఖేష్ కుమార్ మీనా

విజ‌య‌వాడ, నేటి పత్రిక ప్రజావార్త :
రాష్ట్రవ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాలు, వరదల నేపధ్యంలో ఇసుక నిల్వలు తగ్గుముఖం పడుతున్నాయని, వర్షాకాలాన్ని ముగిసిన తురువాత ఇసుక నిల్వలకు కొరత ఉండబోదని వాణిజ్య పన్నుల శాఖ ఛీప్ కమీషనర్, గనులు, అబ్కారీ శాఖ ముఖ్య కార్యదర్శి ముఖేష్ కుమార్ మీనా తెలిపారు. వివిధ రీచ్ ల నుండి సరఫరా నిలిచిపోయిందని, వర్షాలు తగ్గుముఖం పట్టి, రవాణా పరిస్ధితులు మెరుగైన తురువాత పూర్తి స్ధాయిలో ఇసుక అందుబాటులోకి వస్తుందన్నారు. శుక్రవారం నాటికి 28 ఇసుక నిల్వ కేంద్రాలలో 14,48,302 మెట్రిక్ టన్నులు అందుబాటులో ఉందన్నారు. గురువారం 11,218 మెట్రిక్ టన్నుల ఇసుక కోసం రాష్ట్ర వ్యాప్తంగా 948 మంది ధరఖాస్తు చేసుకోగా, వారితో పాటు పెండింగ్ లో ఉన్న 82 ధరఖాస్తుదారులకు 1,129 మెట్రిక్ టన్నుల ఇసుక, మొత్తంగా 1030 మంది ధరఖాస్తుదారులకు 12,345 మెట్రిక్ టన్నుల ఇసుకను సరఫరా చేసామన్నారు. పలు చోట్ల రహదారులు దెబ్బతిన్న పరిస్ధితిలో వినియోగదారులు తమవంతు సహకారం అందించాలని ముఖేష్ కుమార్ మీనా తెలిపారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్లేస్ మీరు చెప్పినా… నన్ను చెప్పమన్నా.. …కూటమి అభివృద్ధిపై చర్చకు రెడీ

-వైసీపీకి మంత్రి సవిత సవాల్ -మీటరు రోడ్డు కూడా వేయలేని అసమర్థులు -వైసీపీ నేతలపై మంత్రి సవిత విసుర్లు -ఉన్న …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *