-వరద ప్రభావిత ప్రాంతాల్లో పది టైర్ల టిప్పర్ 10 మరియు ఐదు ప్రోక్లైన్ల ద్వారా నెలరోజుల పాటు ఉచిత సేవలు
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ఇటీవల సంభవించిన వరదల్లో సర్వసం కోల్పోయిన బాధితుల సహాయార్థం పామర్రు నియోజకవర్గానికి చెందిన కిలారపు శ్రీనివాసరావు ఏపీ సీఎం సహాయ నిధికి రూ, 10లక్షల రూపాయలు విరాళం చెక్ ను ముఖ్యమంత్రి చంద్రబాబుకు స్వయంగా అందజేశారు. బుడమేరు వరద బాధితుల సహాయార్థం 200 సామర్థ్యం గల 5 ప్రొక్లెయినర్, పది టైర్ల టిప్పర్ 10, వరద ప్రభావిత ప్రాంతంలో నెల రోజుల పాటు ఉచితంగా సేవలందించనున్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే వర్ల కుమార్ రాజా, దొడ్డక ఆదినారాయణ తదితరులు ఉన్నారు.