విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
తూర్పు నియోజకవర్గ వైసిపి ఇన్చార్జ్ దేవినేని అవినాష్ ఆధ్వర్యంలో 15, 16, 17 మరియు 18 డివిజన్లలో ఫుడ్, పాలు, వాటర్ పంపిణీ చేశారు. వైసిపి నేతలు మాట్లాడుతూ కృష్ణలంక పరిసర ప్రాంతాలలో అవుట్ ఫాల్ రైన్ వాటర్ బయటకు పంపించడంలో కూటమి ప్రభుత్వం అధికార యంత్రాంగం పూర్తిగా వైఫల్యం చెందిందని అన్నారు. ప్రభుత్వం ముందుగానే కళ్ళు తెరిచి ఉంటే రాణిగారి తోట, కృష్ణలంక,రామలింగేశ్వర నగర్ ప్రాంతంలోకి వరద నీరు వచ్చేది కాదన్నారు.. తూర్పు నియోజకవర్గ వైసీపీ ఇన్చార్జి దేవినేని అవినాష్ ఆధ్వర్యంలో వరద బాధితులకు ఫుడ్, వాటర్, ఫ్రూట్స్, పాలు పంపిణీ చేశారు. రిటైనింగ్ వాల్ జగన్ హయంలో కట్టకపోతే పరిస్థితి వేరే విధంగా ఉండేదన్నారు. దేవినేని అవినాష్ చూపించిన చొరవతో వరదల సమయంలో కూడా ఈ ప్రాంత ప్రజలు ధైర్యంగా జీవించగలుగుతున్నారన్నారు. కూటమి ప్రభుత్వం వరదలను అరికట్టడంలో పూర్తిగా విఫలం అయింది అన్నారు. ఈ పంపిణి కార్యక్రమంలో వైసీపీ నాయకులు వై.సిద్దార్థ గారు, డిప్యూటీ మేయర్ బెల్లం దుర్గ, 17వ డివిజన్ కార్పొరేటర్ తంగిరాల రామిరెడ్డి మరియు డివిజన్ ప్రెసిడెంట్లు, వైసీపీ ముఖ్య న్యాయకులు,క్లస్టర్ ఇంచార్జ్ లు, కార్యకర్తలు పాల్గొన్నారు.
Tags vijayawada
Check Also
వరద బాధితులకు విరాళాల వెల్లువ
-సీఎం చంద్రబాబును కలిసి చెక్కులు అందించిన దాతలు అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : అనూహ్య వరదలతో నిర్వాసితులైన బాధితులకు …