-అంబులెన్స్ లో ప్రభుత్వ ఆసుపత్రికి తరలింపు- తల్లి, బిడ్డ క్షేమం
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు నారా చంద్రబాబునాయుడు ఆదేశాల తో విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర సూచనలు తో వరద ప్రభావిత ప్రాంతాలలో సమస్యలను పరిష్కరించేందుకు ఏర్పాటు చేసిన కంట్రోల్ రూమ్ నుండి వచ్చిన అత్యవసర ఫిర్యాదును, విజయవాడ నగర పాలక సంస్థ బృందం, తక్షణమే చర్యలు తీసుకున్నారు. వాంబే కాలనీలో శనివారం ఉదయం రెండు గంటలకు నొప్పులతో బాధపడుతున్న గర్భిణీ స్త్రీను, సింగ్ నగర్ ఫ్లైఓవర్ వరకు తరలించే దారిలో, విజయవాడ నగరపాలక సంస్థ బోటు లోనే నొప్పులతో ఉన్న గర్భిణీ స్త్రీ ప్రసవమైంది. విజయవాడ నగర పాలక సంస్థ బయాలజిస్ట్ సూర్యకుమార్ వారి బృందం అజిత్ సింగనగర్ ఫ్లైఓవర్ వద్దకు బోటును తీసుకొచ్చాక అంబులెన్స్ లో ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు, డాక్టర్లు తల్లి, బిడ్డ క్షేమం అని తెలిపారు.
Prajavartha Online Telugu News