Breaking News

వరద బాధితులకు అండగా విజయ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్

– సీఎం సహాయ నిధికి డాక్టర్ జి. శరత్ బాబు రూ. 5 లక్షల విరాళం
– వరద బాధితులైన తమ హాస్పిటల్ సిబ్బందికి రూ. 6 లక్షల సహాయం
– రూ. 5 లక్షల చెక్కును సీఎం చంద్రబాబుకు అందజేసిన డాక్టర్ జి. శరత్ బాబు, డాక్టర్ జి. ప్రశాంతి

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
సేవా కార్యక్రమాల్లో ఎల్లప్పుడూ ముందుండే విజయ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్.. ఇటీవల సంభవించిన వరదల్లో నష్టపోయిన బాధితులకు అండగా నిలిచింది. ముఖ్యమంత్రి సహాయ నిధికి హాస్పిటల్ చైర్మన్, ప్రఖ్యాత నెఫ్రాలజిస్ట్ డాక్టర్ జి. శరత్ బాబు రూ. 5 లక్షల విరాళాన్ని అందజేశారు. డాక్టర్ జి. శరత్ బాబు, డాక్టర్ జి. ప్రశాంతి దంపతులు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడును కలిసి రూ. 5 లక్షల విరాళానికి సంబంధించిన చెక్కును అందజేశారు. వరద బాధితులను ఆదుకునేందుకు ముందుకు వచ్చిన విజయ సూపర్ స్పెషాలిటీ అధినేత శరత్ బాబును సీఎం చంద్రబాబు ఈ సందర్భంగా అభినందించారు. ముఖ్యమంత్రి సహాయ నిధికి విరాళం అందజేయడమే కాకుండా, తమ హాస్పిటల్ సిబ్బందిలో కొందరు వరద కారణంగా నష్టపోయినట్లు తెలుసుకున్న విజయ సూపర్ స్పెషాలిటీ యాజమాన్యం.. వారికి తక్షణం సాయమందించింది. వరద ప్రభావిత ప్రాంతాల్లో నివసిస్తున్న సిబ్బందికి రూ. 6 లక్షలతో సహాయ కార్యక్రమాలను చేపట్టారు. ఈ సందర్భంగా డాక్టర్ జి. శరత్ బాబు మాట్లాడుతూ, ప్రజారోగ్య సంరక్షణ కోసం తాము నిరంతర సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. ప్రజలకు ఏ కష్టం వచ్చినా తాము అండగా నిలుస్తామని, వరద కారణంగా నష్టపోయిన తమ సిబ్బందికి అన్ని విధాలుగా తోడ్పాటునందిస్తామని వెల్లడించారు. కష్ట కాలంలో తమకు చేయూతనందించిన హాస్పిటల్ యాజమాన్యానికి విజయ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ సిబ్బంది ధన్యవాదాలు తెలియజేశారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్లేస్ మీరు చెప్పినా… నన్ను చెప్పమన్నా.. …కూటమి అభివృద్ధిపై చర్చకు రెడీ

-వైసీపీకి మంత్రి సవిత సవాల్ -మీటరు రోడ్డు కూడా వేయలేని అసమర్థులు -వైసీపీ నేతలపై మంత్రి సవిత విసుర్లు -ఉన్న …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *