Breaking News

వరద సహాయ చర్యల పర్యవేక్షణ

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త :
విజయవాడలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో నిలిచిన నీటిని బెయిల్ అవుట్ కి అధిక ప్రాధాన్యతగా అధికారులు, సిబ్బంది కృషి చేస్తున్నారని వరద సహాయ చర్యల పర్యవేక్షణ ప్రత్యేక అధికారి కె.కన్నబాబు ఐఏఎస్ తెలిపారు. మంగళవారం గుంటూరు నగర కమిషనర్ పులి శ్రీనివాసులు ఐఏఎస్ పర్యవేక్షణలో ఉన్న 62వ డివిజన్ లోతట్టు ప్రాంతాల్లో జేట్టింగ్ ఇంజిన్ల ద్వారా నీటిని బెయిల్ అవుట్ చేస్తున్న ప్రాంతాలను ప్రత్యేక అధికారి పరిశీలించి, అధికారులుకు తగు ఆదేశాలు జాఈ చేశారు. తొలుత ప్రత్యేక అధికారి కన్నబాబు కి 62వ డివిజన్ లో వరద ప్రభావిత ప్రాంతాలు, నీట మునిగిన ప్రాంతాల్లో బెయిల్ అవుట్ చేయడానికి ఏర్పాటు చేసిన ఆయిల్ ఇంజిన్లు, చేపడుతున్న పారిశుధ్య పనుల వివరాలను డివిజన్ పర్యవేక్షణ అధికారి, గుంటూరు నగర కమిషనర్ పులి శ్రీనివాసులు ఐఏఎస్ వివరించారు. ఈ సందర్భంగా ప్రత్యేక అధికారి మాట్లాడుతూ విజయవాడ ప్రజలు ఎదుర్కొంటున్న విపత్కర పరిస్తితులను ప్రభుత్వం సమర్ధవంతంగా పరిష్కరిస్తుందన్నారు. ప్రదానంగా డివిజన్ల వారీగా కేటాయించబడిన అధికారులు వరద నీటిని బెయిల్ అవుట్ చేయడానికి ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. విజయవాడ నగరంలో పలు వీధుల్లోకి జెట్టింగ్ యంత్రాలు వెళ్లడం లేదని, ఆయా ప్రాంతాల్లో ఆయిల్ ఇంజిన్లను ఏర్పాటు చేయాలన్నారు. స్థానిక పరిస్థితులకు అనుగుణంగా వరద సహాయ చర్యలు చేపట్టడంలో ప్రత్యేక అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్లేస్ మీరు చెప్పినా… నన్ను చెప్పమన్నా.. …కూటమి అభివృద్ధిపై చర్చకు రెడీ

-వైసీపీకి మంత్రి సవిత సవాల్ -మీటరు రోడ్డు కూడా వేయలేని అసమర్థులు -వైసీపీ నేతలపై మంత్రి సవిత విసుర్లు -ఉన్న …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *