-రాష్ట్ర గనులు, అబ్కారీ శాఖ ముఖ్య కార్యదర్శి ముఖేష్ కుమార్ మీనా
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
బుధవారం ఉదయానికి 28 ఇసుక నిల్వ కేంద్రాలలో 14,19,065 మెట్రిక్ టన్నులు అందుబాటులో ఉందని వాణిజ్య పన్నుల శాఖ ఛీప్ కమీషనర్, గనులు, అబ్కారీ శాఖ ముఖ్య కార్యదర్శి ముఖేష్ కుమార్ మీనా తెలిపారు. 9,637 మెట్రిక్ టన్నుల ఇసుక కోసం రాష్ట్ర వ్యాప్తంగా మంగళవారం 863 మంది దరఖాస్తు చేసుకోగా, 723 ధరఖాస్తుదారులకు 7,830 మెట్రిక్ టన్నుల ఇసుకను సరఫరా చేసామని మీనా వివరించారు. పలు చోట్ల రహదారులు దెబ్బతిన్న పరిస్ధితిలో ఇసుక రవాణాకు సమస్యలు ఉత్పన్నం అవుతున్నాయని వినియోగదారులు తమవంతు సహకారం అందించాలని విన్నవించారు. రాష్ట్రవ్యాప్తంగా కురుస్తున్న వరద ప్రభావిత ప్రాంతాలలో ఇసుక నిల్వలు తగ్గుముఖం పడుతున్నాయని, వర్షాకాలం ముగిసిన తరువాత ఇసుక నిల్వలకు కొరత ఉండబోదన్నారు. పలు రీచ్ ల నుండి సరఫరా నిలిచిపోయిందని, వర్షాలు తగ్గి, రవాణా పరిస్ధితులు మెరుగైన తురువాత పూర్తి స్ధాయిలో ఇసుక అందుబాటులోకి వస్తుందన్నారు.
Prajavartha Online Telugu News