Breaking News

వరద బాధితుల కోసం తెలుగు రాష్ట్రాలకు “దివీస్” యాజమాన్యం 15 కోట్ల విరాళం

-ఎపి కి నారా లోకేష్ ద్వారా రూ.5 కోట్లు
-అక్షయ పాత్రకు రూ.5 కోట్లు
-తెలంగాణ సిఎం 5 కోట్లు
-దివిస్ ఎండి. మురళి దివి

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
ఇటీవల తెలుగు రాష్ట్రాలలో సంభవించిన వరదల నేపథ్యంలో ఆయా రాష్ట్రాల ముఖ్యమంత్రులు ప్రజలను ఆదుకునేందుకు సామాజిక బాధ్యతగా విరాళాలు అందించాలని ఇచ్చిన పిలుపుమేరకు దివీస్ లేబరేటరీస్ యాజమాన్యం ఉభయ తెలుగు రాష్ట్రాలకు 15 కోట్ల విరాళం అందించినట్లు దివిస్ లేబొరేటరీ మేనేజింగ్ డైరెక్టర్ మురళి దివి తెలిపారు . వరద ముంపు వార్త వినగానే 5 కోట్లు వరద బాధితులకు తక్షణ సహాయంగా విజయవాడ నగరం, పరిసర ప్రాంతాలలో వరద ముంపుకు గురైన ప్రాంతాలలో బాధితులకు ఆహారం అందించేందుకు సైతం 16 లక్షల ఆహార పొట్లాల పంపిణీ నిమిత్తం అక్షయ పాత్ర ఫౌండేషన్ కు 5 కోట్ల రూపాయలను ఫౌండేషన్ కి ఇవ్వడం జరిగిందని మరో రూ. 5 కోట్ల విరాళం చెక్కును దివిస్ సంస్థ సిఇఒ డాక్టర్ కిరణ్ దివి ఆదివారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యా శాఖ మంత్రి నారా లోకేష్ కు హైదరాబాదులోని స్వగృహంలో అందజేశారు. ఈ సందర్భంగా మురళి దివి మాట్లాడుతూ దివిస్ లేబరేటరీ యాజమాన్యం తెలుగు రాష్ట్రాలలో ప్రకృతి విపత్తులు సంభవించిన ప్రతి సందర్భంలోనూ స్వచ్ఛందంగా విరాళాలు అందజేసిందని గుర్తు చేశారు. ఇటువంటి ఆందోళనకర విపత్తులు సంభవించిన సందర్భంలో ప్రతి ఒక్కరూ మానవతా దృక్పథంతో సాయం అందించాలని ఆకాంక్షించారు. వరద బాధితులు వీలైనంత వేగంగా సాధారణ జీవితం గడిపేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేపడుతున్న చర్యలు అభినందనీయమన్నారు. మరింత మంది మానవతావాదులు కష్టకాలంలో ఉన్న బాధితులను ఆదుకునేందుకు వారి వారి ఆర్థిక సహాయం ప్రభుత్వానికి అందించేందుకు ఇదే సరైన సమయమన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి సైతం 5 కోట్ల విరాళాన్ని ప్రకటించి, సంబంధిత చెక్కును సిఇఒ డా. కిరణ్ దివి రాష్ట్ర ముఖ్యమంత్రికి రేవంత్ రెడ్డి కి అందజేసినట్లు మురళి దివి తెలిపారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్లేస్ మీరు చెప్పినా… నన్ను చెప్పమన్నా.. …కూటమి అభివృద్ధిపై చర్చకు రెడీ

-వైసీపీకి మంత్రి సవిత సవాల్ -మీటరు రోడ్డు కూడా వేయలేని అసమర్థులు -వైసీపీ నేతలపై మంత్రి సవిత విసుర్లు -ఉన్న …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *